టీడీపీలో ఇంకో వికెట్: నారా లోకేష్ ముఖ్య అనుచరుడి రాజీనామా: దేవినేని అవినాష్ తో టచ్ లో.. !

Recommended Video

    TDP Key Leader Nadendla Brahmam Chowdhary Resigns From Party ! || Oneindia Telugu

    విజయవాడ: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. పదవి నుంచి తప్పుకొన్నప్పటికీ.. తాను పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు.

    లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా..

    లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా..

    బ్రహ్మం చౌదరికి మాజీమంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ అనుబంధ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా ఆయన యువత ఓట్లను పార్టీ వైపు మళ్లించడానికి కృషి చేశారు. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచార సభలను నిర్వహించారు.

    చంద్రబాబు ప్రోత్సాహంతోనే..

    చంద్రబాబు ప్రోత్సాహంతోనే..

    చంద్రబాబుకు తాను రాసిన రాజీనామా లేఖలో కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను రాజకీయాల వైపు అడుగులు వేసేలా తనను ప్రోత్సహించారని అన్నారు. చంద్రబాబు దయతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. చంద్రబాబు సూచనలు, సలహాల మేరకు తాను పార్టీలో అవిశ్రాంతంగా కృషి చేశానని చెప్పుకొచ్చారు. అధ్యక్ష పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవాల్సి వస్తోందని అన్నారు.

    దేవినేని అవినాష్ తో టచ్ లో..

    దేవినేని అవినాష్ తో టచ్ లో..

    ఇదిలావుండగా- నాదెండ్ల బ్రహ్మం చౌదరి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇదివరకు దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా బ్రహ్మం చౌదరి తరచూ మాట్లాడుకునే వారని, వారిద్దరి మధ్యా సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.

    వైసీపీ వైపు లాగేస్తారా?

    వైసీపీ వైపు లాగేస్తారా?

    దేవినేని అవినాష్ కొద్దిరోజుల కిందటే అధికార వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. అటు దేవినేని అవినాష్, ఇటు బ్రహ్మం చౌదరి.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడం కూడా వారిద్దరి మధ్య సత్సంబంధాలకు ఓ కారణమని చెబుతున్నారు. పార్టీలు వేరైనప్పటికీ.. దేవినేని అవినాష్, బ్రహ్మం చౌదరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అవినాష్.. బ్రహ్మం చౌదరిని వైసీపీ వైపు లాగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+