మహిళా సెక్స్ వర్కర్ల కౌంట్‌లో టాప్‌లో తెలుగు రాష్ట్రాలు.. ఏ ఏ స్థానాల్లో అంటే..?

పేదరికం, కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు.. ఇలా కారణం ఏదైనా కానీ మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్న ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 2025 జూన్ 2న విడుదలైన "Programmatic Mapping and Population Size Estimation (PMPSE)" అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా వేశారు. అందులోనే దాదాపు 53 శాతం మంది కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది.

PMPSE నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య 9,95,499 గా అంచనా వేశారు. ఇందులో కేవలం ఐదు రాష్ట్రాల్లోనే మొత్తం సంఖ్యలో సగానికి పైగా, అంటే 53% సెక్స్ వర్కర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రాల వారీగా టాప్ 5 జాబితాని పరిశీలిస్తే..

telugu-states-top-in-the-number-of-female-sex-workers-across-india

1. కర్ణాటక - 15.4%

2. ఆంధ్రప్రదేశ్ - 12.0%

3. మహారాష్ట్ర - 9.6%

4. ఢిల్లీ - 8.9%

5. తెలంగాణ - 7.6%

తాజా అధ్యయనాల ప్రకారం.. గతకొంత కాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా సెక్స్ వర్కర్ల (Female Sex Workers - FSWs) సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అత్యధిక సెక్స్ వర్కర్లున్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాకుండా రెడ్ లైట్ హాట్‌స్పాట్‌ల పరంగా.. అంటే సెక్స్ వర్క్ జరుగుతున్న స్థలాల సాంద్రతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రతి హాట్‌స్పాట్‌లో సగటున 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉంటున్నారని అంచనా వేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల తగ్గుదల వల్ల, అనేక మహిళలు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. అలానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఈ వృత్తిలోకి వస్తున్నారని పేర్కొన్నారు. సెక్స్ వర్క్ చేసే మహిళల్లో హెచ్‌ఐవి, ఇతర లైంగిక వ్యాధుల వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉండటంతో.. సామాజిక ఆరోగ్య రంగానికి కూడా ఇది ఒక కీలకమైన ఛాలెంజ్ అవుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం నంబర్లలో పెరుగుదల కాదని, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, మానవ హక్కుల కోణాల్లో సమగ్ర దృష్టి అవసరమని పలువురు ప్రముఖులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+