వేధింపులు: మహిళతో టిడిపి నేత అసభ్య ప్రవర్తన, కేసు నమోదు
గుంటూరు: ఏపీలోని గుంటూరు తెనాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ పైన పోలీసు కేసు నమోదయింది. కౌన్సిలర్ పెండ్యాల వెంకట్రావు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే కౌన్సిలర్‌ను, యువతిని ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తామని చెబుతున్నారు. యువతికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సబ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సదరు కౌన్సిలర్ పెండ్యాల వెంకట్రావు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో చిర్రెత్తుకొచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications