Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాడు పగులుతోంది, కొత్త రికార్డు - తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వేడి నమోదవుతోంది. తాజా గా ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక.. 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది.

తీవ్ర వడగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఏపీలోని 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు లో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 కర్నూలులో 41.7, పార్వతీపరం మన్యం జిల్లా సేదుపేట లో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరం లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి.

temperatures-are-expected-to-rise-again-as-disaster-management-predictions

ఎండలతో బీ అలర్ట్
ఇక, నేడు (శుక్రవారం) ఈ రోజు 89 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 208 మండలాల్లో వడగాలు లు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. విజయనగరంలో 22 మండలాలు, శ్రీకాకుళంలో 14, పార్వతీపురం మన్యంలో 12, అల్లూరి సీతా రామారాజు 9, అనకాపల్లి 9, తూర్పు గోదావరి 8, కాకినాడ 7, ఏలూరు 5, ఎన్టీఆర్ జిల్లాలో మూడు మండలాల్లో ఈ రోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

తాజా హెచ్చరిక
ఇదే సమయంలో పల్నాడులో 26, ఏలూరు 22, గుంటూరు 17, క్రిష్ణా 17, ప్రకాశం 14, శ్రీకాకుళం 14. కాకినాడ 13, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ 12, ఎన్టీఆర్ 12, తూర్పు గోదావరి 11, పశ్చిమ గోదావరి 11, అనకాపల్లి 9, బాపట్ల 9, అల్లూరి సీతారామాజు 6, విజయనగరం 5, విశాఖ 4, పార్వతీ పరం మన్యం 3, తిరుపతి 2, నెల్లూరు 1 మండలంలో వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+