ఏ పార్టీ అధికారంలో ఉన్నాసరే తాడిపత్రిలో టెన్షనే .. భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఉద్రిక్తతలు ఉండే జిల్లా అంటే అనంతపురం జిల్లా అని చెప్పాలి. ఎప్పుడు ఉద్రిక్తతలు ఉండే నియోజకవర్గం అంటే తాడిపత్రి నియోజకవర్గం అని చెప్పి తీరాలి. తాజాగా మరోమారు తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జెసి వర్గం వర్సెస్ కేతిరెడ్డి వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడ రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది.

కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్
తాజాగా మరోమారు వైసిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టిడిపి నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటలయుద్ధం చోటు చేసుకుంది. ఇది తాడిపత్రిలో ఉద్రిక్తతలకు కారణమైంది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పైన టిడిపి ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని ప్రచారం చేసుకుంటున్న వేళ, సాగునీటి ప్రాజెక్టుల అంశంపైన రాయలసీమ పౌరుషంపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీకి సవాల్ విసిరారు.

tension in Tadipatri irrigation projects Rayalaseema Pride Row between jc and kethireddy

తాడిపత్రిలో టెన్షన్ .. అలెర్ట్ అయిన పోలీసులు
కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్, అనంతపురం టవర్ క్లాక్ ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దని కేతిరెడ్డి హెచ్చరించారు. దీంతో అదే స్థాయిలో జెసి వర్గీయులు కూడా విరుచుకుపడ్డారు. ఇరు వర్గాలకు చెందినవారు రోడ్డెక్కి నిరసనలకు దిగే అవకాశం ఉందని, ఉద్రిక్తతలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

తాడిపత్రిలో అదనపు బలగాలు రంగంలోకి
తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం తాడిపత్రిలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక తాజా పరిణామాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన తాడిపత్రి అనంతపురం పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.

పోలీస్ స్టేషన్లలో పెద్దారెడ్డిపై మూడు కేసులు
సెక్షన్ 196(1) BNS కింద అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన కేసు నమోదు కాగా. అలాగే, తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 351(2), 352, 353(2) r/w 3(5) BNS, కింద కేసు నమోదు అయింది. సెక్షన్లు 351(2), 352 r/w 3(5) BNS కింద కూడా ఆయన పైన కేసులు నమోదు చేశారు.

పోలీసుల హెచ్చరిక
రాజకీయ నాయకుల వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన కేసులు నమోదు కావడంతో అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+