రెండోరోజు చంద్రబాబు విచారణ.. సిఐడీ అధికారుల ప్రశ్నలపై ఉత్కంఠ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ (skill development scam) కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుని సిఐడి అధికారులు విచారించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయగా కోర్టు రెండు రోజుల సిఐడి కస్టడీకి (CID custody) అనుమతించింది.
దీంతో ఈ కేసులో చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే నిన్న చంద్రబాబు నాయుడుని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సిఐడి అధికారులు నేడు మరోమారు చంద్రబాబును విచారించనున్నారు. విచారణలో భాగంగా మొత్తం 120 ప్రశ్నలను సిద్ధం చేసిన సిఐడి అధికారులు తొలిరోజు చంద్రబాబును 50 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రశ్నల్లో చంద్రబాబును సీమెన్స్ ఒప్పందం, స్కిల్ కేసులో ఆర్ధిక లావాదేవీల పైన ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది.

డీ పి ఆర్ లేకుండా స్కిల్ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే చేయించారు అన్న ప్రశ్నతో పాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి వద్దన్నప్పటికీ నిధులు ఎందుకు విడుదల చేయించారు అన్నదానిపై ప్రధానంగా ప్రశ్నించారు. అంతేకాదు సుమన్ బోస్ తో రహస్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని ఆరా తీశారు. యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిని ఎందుకు డిప్యూటేషన్ పై డిప్యూటీ సీఈవోగా తీసుకువచ్చారు వంటి ప్రశ్నలను కూడా సంధించారు.
ఇక గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టిన వ్యవహారం, ఆయనతో జరిపిన ఈ మెయిల్ సంభాషణల వ్యవహారం పైన కూడా ప్రధానంగా ప్రశ్నించారు. తొలిరోజు 50 ప్రశ్నలని అడిగిన సిఐడి అధికారులు ఆయన ఇచ్చిన సమాధానాలను చంద్రబాబు అడ్వకేట్ ల సమక్షంలోనే రికార్డ్ చేశారు. ఇక నేడు మిగతా అంశాలపై చంద్రబాబును విచారించనున్నారు (chandrababu inquiry).
డిఎస్పి ధనుంజయుడు నేతృత్వం లోని 12 మంది సభ్యుల బృందం నేడు కూడా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో (rajahmundry central jail conference hall) విచారించనున్న నేపథ్యంలో ఈరోజు అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? ఆయన ఏం సమాధానం చెబుతారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే చంద్రబాబు విచారణకు సహకరించటం లేదు అన్న చర్చ నేపథ్యంలో మరి ఈరోజు చంద్రబాబు ఏపీ సిఐడి అధికారులకు సహకరిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications