బండారు అరెస్టుకు రంగం సిద్ధం: భారీగా మోహరించిన పోలీసులు- ఉద్రిక్తత

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై బండారు సత్యనారాయణ అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనపై కేసు నమోదైంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మహిళపై బండారు సత్యనారాయణ అనే ఒకడు రోజాపై ఆరోపణలు చేస్తోంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుందంటూ మండిపడ్డారు.

Tension prevailed after Police arrives tdp leader Bandaru Satyanarayana residence to his arrest

మంత్రి హోదాలో ఉన్న మహిళకే ఈ పరిస్థితి ఉంటే ఇంక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి, మహిళా కమిషన్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. దీనిపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనితో బండారును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బండారు ఇంటికి వెళ్లే మార్గాల్లో భారీగా మోహరించారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి చేరుకుంటోన్నారు. వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటోన్నారు. ఫలితంగా అనకాపల్లి, పరవాడ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+