అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం బ్యారేజ్ కు భారీ వరద-మళ్లీ చంద్రబాబుకు తలనొప్పి-ఇంకెన్నాళ్లిలా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటే ప్రధాన నదుల్లో వరద ప్రభావం కూడా పెరుగుతోంది. బ్యారేజీలు, ఆనకట్టల వద్ద పెరుగుతున్న ప్రవాహంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇదే క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న కృష్ణానదీ వరద ప్రవాహం ఎప్పటిలాగే ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో కరకట్ట మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

 ప్రకాశం బ్యారేజ్ కు వరద

ప్రకాశం బ్యారేజ్ కు వరద

ఏపీలోని కృష్ణానదిపై ఉన్న చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. ఏటా కృష్ణానదిలో వచ్చే వరద ప్రవాహం ఇక్కడ చివరిగా నిల్వ చేస్తారు. దాని తర్వాత మాత్రం ఇక సముద్రంలోకి వెళ్లితీరాల్సిందే. గత కొన్నేళ్లుగా నిలకడగా కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఇదే కోవలో ఈసారి కూడా కృష్ణానదిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. ఈ ప్రవాహం నదీ పరివాహ ప్రాంతంలో ఉన్న కట్టడాలను టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది.

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు


కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో పాక్షితంగా గేట్లు తెరిచి నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అయితే పూర్తిస్దాయిలో వరద వస్తేనే ఈ మొత్తం గేట్లు తీసి వరద ప్రవాహాన్ని సముద్రంలోకి పంపేందుకు వీలుంటుంది. లేకపోతే బ్యారేజ్ వద్దే నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ వర్షాకాలంలో పెరుగుతున్న వరద ప్రవాహాలు ఉండవల్లి కరకట్టపై ఉన్నచంద్రబాబు ఇంటిని టెన్షన్ పెడుతున్నాయి.

చంద్రబాబుకు తలనొప్పి ?

చంద్రబాబుకు తలనొప్పి ?

ఏటా కృష్ణానదిలో వచ్చే వరదలు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. అప్పటివరకూ కరకట్ట ఇంట్లోనే ఉంటున్న చంద్రబాబు.. వరద ప్రవాహం పెరిగితే మాత్రం దాన్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. దీంతో చంద్రబాబుకు మరోసారి తలనొప్పి తప్పేలా లేదు. వరద ప్రవాహం మరింత పెరిగితే మాత్రం అధికారులు కరకట్టపై ఉన్న కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేస్తుంటారు. ఇప్పటవివరకూ పరిస్ధితులు అదుపులోనే ఉన్నాయని భావిస్తున్న అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఏటా వచ్చే వరదల బారిన పడకుండా నగరంలో మరో కొత్త నివాసానికి మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు.

English summary
krishna river flodding is creating tension against to tdp chief chandrababu house on undavalli karakatta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X