అల్లు అర్జున్ అరెస్ట్ తో ఉద్రిక్తత.. స్టేషన్ బెయిల్ వస్తుందా లేక కోర్టులో హాజరుపరుస్తారా?

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు ఊహించిన విధంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణ కోసమే అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించిన పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ స్టేషన్ బెయిల్ పైన విడుదల చేస్తారా లేక కోర్టుకు పంపిస్తారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

పోలీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
నేడు అల్లు అర్జున్ ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట విచారణ నిమిత్తం అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు ఆయనను పోలీసు వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 105 ,118 (1), రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేశారు.

Tensions rise over Allu Arjun s arrest Will he get station bail or will he be produced in court

అల్లు అర్జున్ కారణంగా తొక్కిసలాట
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అని మహిళ చనిపోగా ఆమె కొడుకు తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణమని, ఆయన పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ఈ క్రమంలో అల్లు అర్జున్ తో పాటు ధియేటర్ యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు విచారణ నిమిత్తం తీసుకువెళ్లారు. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లోకి భారీగా మోహరించిన పోలీసులు ఆ దిశగా ఎవరిని రానివ్వడం లేదు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసుల పహారా
భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను సైతం పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో భారీ భద్రతను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహార కాస్తున్నారు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను విచారించిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా లేక కోర్టులో హాజరు పరుస్తారా అన్నది మాత్రం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠకు కారణంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+