పవన్ కళ్యాణ్ బాటలో యంగ్ స్టార్ పొలిటీషియన్.. దళపతి విజయ్
పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయంగాను పవర్ స్టార్ అనిపించారు. గత పదేళ్లుగా ఏపీ రాజకీయాలలో ఎత్తు పలాలను చూసిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఫైనల్ గా అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. ఏపీ ప్రజలు జనసేన పార్టీ అభ్యర్థులకు 100 స్ట్రైక్ రేట్ తో విజయాన్ని కట్టబెట్టారు. దేశంలోనే ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం ఒక జనసేనకే సాధ్యమైంది.
అప్ కమింగ్ పొలిటిషియన్స్ కు రోల్ మోడల్ పవన్ కళ్యాణ్
అరుదైన రికార్డును సృష్టించడంతో పాటు పవన్ కళ్యాణ్ ఎంతోమంది అప్ కమింగ్ పొలిటిషియన్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన సభ్యులు అందరూ విజయం సాధించడంతో తమిళనాడులో రాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీతో రంగంలోకి దిగిన దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ పై పెట్టిన పోస్ట్ ఇద్దరికీ మధ్య సారూప్యతను చెప్తుంది.

పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్తూ విజయ్ పోస్ట్
పవన్ కళ్యాణ్ విజయ్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు అన్న చర్చను అందరూ జరిపేలా చేస్తుంది. దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్దపార్టీగా అవతరించినందుకు ఆనందంగా ఉందని విజయ్ పోస్ట్ పెట్టారు. ప్రజలకోసం మీరు కట్టుబడిన తీరు, మీ పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నామని దళపతి విజయ్ స్పష్టం చేశారు.
జనసేన ప్రస్థానం విజయ్ కు స్పూర్తినిస్తుంది
ఇక దళపతి విజయ్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేయడంతో, విజయ్ కూడా పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాలలోకి ప్రజలకు సేవ చేయాలన్న విజన్ తో వస్తున్న నాయకుడని, పదేళ్ల పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రస్థానం విజయ్ కు తప్పనిసరిగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ తీరుగా విజయ్ కూడా సక్సెస్ కావాలని కోరుతున్న ఫ్యాన్స్
పవన్ బాటలో యంగ్ స్టార్ పొలిటీషియన్ గా విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు రాజకీయాలకు కేరాఫ్ గా మారతారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను విజయ్ రీ మేక్ చేసి సక్సెస్ సాధించినట్టే, విజయ్ పాలిటిక్స్ లో కూడా పవన్ తీరులో సక్సెస్ అయ్యేదాకా పోరాటం చేస్తాడని అందరూ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications