Thalapathy Vijay: పాదయాత్రకు సిద్ధమైన దళపతి విజయ్; రాజకీయాల్లో ఎంట్రీ పక్కా!!
ఎంతో కాలంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న దళపతి విజయ్ దాని కోసం అనూహ్యంగా అడుగులు వేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని వ్యూహాలకు పదును పెడుతున్న విజయ్ తాజాగా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. సినీ రంగంతో పాటు రాజకీయవర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న దళపతి విజయ్ పాదయాత్ర వార్త ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
సినీ హీరో విజయ్.. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. హీరో రజినీకాంత్ కి ఎలా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ దళపతి విజయ్ కు కూడా ఉంటుంది. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడని ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఆ ముహూర్తం రాలేదు. ఇక తాజాగా ఆయన వేస్తున్న అడుగులు పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్నట్టు ఉన్నాయి.

రాజకీయాల్లో అడుగు పెట్టడం కోసమే పాదయాత్ర చేయడానికి రెడీ అయినట్టు, ప్రస్తుతం అందుకు తగ్గ గ్రౌండ్ ను విజయ్ సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయన విజయ్ మక్కల్ ఇయక్కం అభిమాన సంఘ సభ్యులతో తరచూ భేటీ అవుతూ సామాజిక సేవా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన అభిమాన సంఘం సభ్యులతో జరిగిన భేటీలో పాదయాత్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ తాను నటించిన లియో సినిమా విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని సమాచారం. లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈలోపే విజయ్ తన పాదయాత్ర నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే దళపతి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు.
ఇప్పటివరకూ దివంగతులైన నేతల జయంతి కార్యక్రమాలను, అనేక ముఖ్య కార్యక్రమాలను తన అభిమానుల ద్వారా చేయిస్తున్నారు. ఇక ఇటీవల వెలువడిన 10, ప్లస్ 2 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని పిలిపించి వారిని సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఒక్కొక్క నియోజకవర్గం నుండి ముగ్గురిని ఎంపిక చేసి వారిని ఘనంగా సత్కరించారు విజయ్ . విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులతోనూ విజయ్ సమావేశం నిర్వహించారు.
అంతేకాదు ఇప్పటికే విజయ్ మక్కల్ ఇయక్కంలో జాలర్లు, మహిళలు, విద్యార్ధి విభాగాలను కూడా ఏర్పాటు చేశారు.ఇక పాదయాత్ర నిర్ణయంతో విజయ్ రాజకీయ ఆరంగేట్రం చెయ్యటానికి రెడీ అవుతున్నారని చర్చ జరుగుతుంది. త్వరలోనే అది జరుగుతుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2026 ఎన్నికల లక్ష్యంగా దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీ పక్కా అంటున్నారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications