వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టివి 9 రవిప్రకాష్ పై గతంలో దాడి చేసిన వ్యక్తి...హఠాత్తుగా తెరమీదకు!ఎందుకిలా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

టివి 9 సిఈవో రవి ప్రకాష్ పై గతంలో చెప్పుతో దాడి చేసిన వ్యక్తి(పేరు రమణగా తెలుస్తోంది) హఠాత్తుగా తెర మీదకు వచ్చారు. ఈ రమణ అనే వ్యక్తి తాను రవిప్రకాష్ ను ఎందుకు చెప్పుతో కొట్టాను...దానికి పూర్వాపరాలు ఏంటి?...ఆ తర్వాత ఏం జరిగింది అనే వివరాలు వెల్లడిస్తున్న వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

అయితే ఈ వీడియో కొత్తది కాదని, పాతదేనని...అయితే దానిని పవన్ కళ్యాణ్ అభిమానులు తాజాగా ఉద్దేశ్యపూర్వకంగా ట్రెండింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తన టార్గెటెడ్ మీడియాపై పవన్ కళ్యాణ్ దాడి కొనసాగుతుందని, అందుకు అతడి అభిమానుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తేటతెల్లమైపోయింది. దీన్నిబట్టి ఈ తరహా వీడియోలు ఇకముందు సోషల్ మీడియాను ముంచెత్తనున్నట్లు తెలుస్తోంది.

హఠాత్తుగా...ట్రెండింగ్ లోకి

హఠాత్తుగా...ట్రెండింగ్ లోకి

సోషల్ మీడియా లో ఆదివారం ఒక వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయింది. రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో టివి 9 సిఈవో రవి ప్రకాష్ కాళ్లపై ఒక వ్యక్తి పడుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసి...ఆ వ్యక్తి ఎవరు..ఎందుకు మీ కాళ్లపై పడుతున్నాడో వివరాలు చెప్పండి అంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ప్రశ్నలకు రవి ప్రకాష్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరోవైపు పవన్ మాత్రం రవి ప్రకాష్ పై తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా రవిప్రకాష్ ను గతంలో చెప్పుతో కొట్టిన వ్యక్తి వీడియో తెరమీదకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అందులో...ఏమని ఉందంటే?

అందులో...ఏమని ఉందంటే?

రవిప్రకాష్ గారూ! భయమంటే తెలియని మీకు...దేశంలో విఐపిలను,సెలబ్రిటీలను గడగడలాడించిన మీరు...భయపడిన రోజు నేను మీపై చెప్పుతో దాడి చేసిన రోజంటూ ఆ వీడియో క్లిప్పింగ్ లో రమణ అనే వ్యక్తి వివరణ, ఆ తరువాత సవాలు చేయడం ఉన్నాయి. అయితే ఆ దాడిని ఫ్యాక్షనిస్టుల దాడి అని టివి 9 లో సమర్థించుకున్నావని...కానీ సాక్షి మీడియాలో చెప్పుతో దాడి వెనుక అసలు కారణాలు రావడంతో...డంగై పోయి...నన్ను అప్పటికప్పుడు హుటాహుటిన ఫ్లైట్ లో ముంబాయి పిలిపించి...టివి 9 సంస్థ మనుగడ పోతోందని బ్రతిమలాడించుకొని క్షమాపణ చెప్పించుకున్నావంటూ రమణ అనే వ్యక్తి ఈ వీడియోలో వివరించాడు. అంతేకాదు తనను ఎన్నో రకాలుగా ప్రాధేయపడి...దీనపు చూపులు చూస్తే...సంస్థ బాగు కోరి...తన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పినట్లుగా ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఆ తరువాత కూడా నీలో ఏ మార్పు రాలేదని...నిన్నుఎన్నిసార్లు కాపాడినా అంతేనని...అందుకే ఇప్పుడు చెబుతున్నా నీలో చెడు అంతమయ్యేంత వరకు యుద్దం కొనసాగిస్తూనే ఉంటానని రమణ చెప్పడంతో వీడియో ముగుస్తోంది.

పాతదే...కానీ కొత్తగా

పాతదే...కానీ కొత్తగా

ఈ వీడియో లో సదరు రమణ అనే వ్యక్తి మాటలను బట్టి అతడే రవి ప్రకాష్ పై చెప్పుతో దాడి చేశాడని అర్థం అయితే ఈ వీడియో కొత్తది కాదని పాతదేనని మీడియా వర్గాల సమాచారం. అలా అయితే ఈ పాత వీడియోను ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ చేసినట్లు తెలుస్తోంది. మరైతే అలా ఎవరు చేసి వుంటారు...ఇంకెవరూ రవి ప్రకాష్ పై యుద్దం ప్రకటించిన పవన్ కళ్యాణో, లేక అతడి అభిమానులో...లేదా ఆ రమణ అనే వ్యక్తో ఈ వీడియోను మళ్లీ తెరమీదకు తెచ్చారు. అయితే హఠాత్తుగా ఈ వీడియో తెరమీదకు రావడానికి కారణం ఏంటో వేరుగా చెప్పనక్కర్లేదు. రవిప్రకాష్ పై పవన్ కళ్యాణ్ యుద్దం నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు బైటకు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

మరి తరువాత...ఏం జరుగుతుంది?

మరి తరువాత...ఏం జరుగుతుంది?

ఈ వీడియోను బట్టి రవి ప్రకాష్ మీద కొంతకాలం ఈ తరహా దాడులు తప్పవని, పైగా ముందు ముందు మరింత ఉదృతమవడం ఖాయమని తాజా పరిస్థితులని బట్టి అర్థం అవుతోంది. ఒకవేళ ఏదేని కారణంగా పవన్ కళ్యాణ్ దాడిని ఆపినా అతడి అభిమానులో లేక రవి ప్రకాష్ వ్యతిరేకులో ఇప్పుడప్పుడే ఈ దాడిని నిలిపివేయకపోవచ్చు...అంతేకాదు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు అతడు ఎవరి మీదైతే యుధ్దం ప్రకటించాడో వారందరికీ సంబంధించిన వివరాలు, లోగుట్టులు, ఆస్తులు, ఇతర మైనస్ పాయింట్లు అన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కూడా తన అభిమానులకు ఆ విధంగానే దిశానిర్దేశం ఇప్పటికే చేసాడనో, లేదా చేయబోతున్నాడనో చెబుతున్నారు. అదే నిజమైతే మరి కొన్ని సంచలన విషయాలు, వీడియోలు, ఆధారాలు కొంత కాలం పాటు మీడియాలో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

English summary
A video related to TV 9 CEO Ravi Prakash, suddenly came in to trending on sunday. In this video a man named Ramana had revealed details of his attack on Ravi Prakash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X