మీ చిన్నారుల కోసం 'బాల ఆధార్' కార్డు- ఇలా పొందండి.. మార్గదర్శకాలు..!!
ఆధార్ ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ తప్పని సరి. పెద్దల నుంచి చిన్నారుల వరకు ఆధార్ కార్డు ఇప్పుడు జారీ చేస్తున్నారు. కాగా.. 5 ఏళ్ల లోపు పిల్లల కోసం బాల ఆధార్ కార్డులు ఇస్తున్నారు. ఈ కార్డు నెంబర్ ఒకసారి మాత్రమే ఇస్తారు. కానీ, అందులో బయోమెట్రిక్స్ ఉండవు. కేవలం ఫొటో, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి. పిల్లల తల్లి లేదా తండ్రి ఆధార్‌తో లింక్ అయిన 12 అంకెల ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. బాల్ ఆధార్ కార్డు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ప్రత్యేకించి పిల్లల స్కూల్ అడ్మిషన్, ఆరోగ్య సేవలు, పెట్టుబడి సంబంధిత పథకాలకు ఆధార్ కార్డ్ అవసరం. బాల ఆధార్ కార్డ్ 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ వయస్సు పిల్లల బయోమెట్రిక్ సమాచారం (ఫింగర్ ఫ్రింట్, కంటి ఐరీస్ స్కాన్) తీసుకోరు. ఎందుకంటే ఆ వయస్సులో ఈ బయోమెట్రిక్ డేటా పూర్తి స్థాయిలో ఉండదు. పిల్లల ఫొటో, పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల సమాచారం మాత్రమే కార్డులో రిజిస్టర్ చేస్తారు. బాల్ ఆధార్ నెంబర్ ఒకటి మాత్రమే ఉంది. అది ఎప్పటికీ మారదు. ఏదైనా అధీకృత ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా బాల్ ఆధార్ పొందవచ్చు.

కాగా, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జనన సమయంలో ఆధార్ రిజిస్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ బాల ఆధార్ పొందడానికి కొన్ని ప్రత్యేక డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆస్పత్రులు జారీ చేసిన పిల్లల జనన ధృవీకరణ పత్రం (డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్) తో పాటుగా తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్‌తో లింక్, అప్‌డేట్ కోసం తల్లి లేదా తండ్రి మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
చిన్నారి డాక్యుమెంట్లతో సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లి.. అక్కడ దరఖాస్తు పూర్తి చేయటం ద్వారా పిల్లల లైవ్ ఫొటో క్యాప్చర్ చేసి తీసుకుంటారు. ఆ తర్వాత, రిజిస్టర్ సంఖ్య తో స్లిప్ ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఈ ఆధార్ స్టేటస్ చెక్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత, 60 రోజుల నుంచి 90 రోజుల్లోపు బాల్ ఆధార్ కార్డు రిజిస్టర్డ్ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా వస్తుంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్‌డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications