చంద్రబాబు ప్రమాణస్వీకారం, ఆ జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే, బాబు సొంత జిల్లాలో స్పెషల్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చెయ్యడానికి కౌంట్ డౌన్ మొదలైయ్యింది. బుధవారం విజయవాడలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో లైవ్ లో ఆ కార్యక్రమం చూడటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని సంబంధిత అధికారులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. మంగళవారం చిత్తూరులో ఆర్డీవోలు, పురపాలక మండల అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ షన్మోహన్ చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు.

నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి విజయవాడ వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రత్యక్షంగా చూడటానికి ప్రతి నియోజక వర్గానికి నాలుగు బస్సులు ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజక వర్గం అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంతో సహ జిల్లాలోని 7 నియోజక వర్గాల నుంచి ప్రతి నియోజక వర్గం నుంచి నాలుగు బస్సుల్లో మంగళవారం సాయంత్రం చంద్రబాబు అభిమానులు విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ప్రతి బస్సులో ఓ నోడల్ అధికారి ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం విజయవాడలోని ముందుగా సూచించిన చెక్ పాయింట్ దగ్గరకు బస్సులు చేరుకుంటాయి, నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తి అయిన తరువాత బుధవారం సాయంత్ర మళ్లీ విజయవాడలో బస్సులు బయలుదేరాల చూసుకోవాలని, గురువారం ఆయా నియోజక వర్గాలకు బస్సులు చేరుకున్న తరువాత ప్రజలు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చెయ్యాలని, చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం రోజు పండుగ వాతావరణం ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కలాక్షేత్రంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మొదలు అయ్యేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications