పెద్దిరెడ్డి అడ్డా లో ప్రత్యేక నిఘా, పక్కలో కర్ణాటక బార్డర్, ఎప్పుడైనా, ఎలాగైనా వస్తే !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తరువాత రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీకి, తరువాత టీడీపీ నుంచి వైసీపీకి జంప్ జిలాని అయిన నాయకులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో తామే అధికారంలోకి వస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే వైస్ జగన్ అరాచక పాలనకు తాము చెక్ పెట్టామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటిమి నేతలు అంటున్నారు. పోలింగ్ రోజు ఆయా నియోజక వర్గాల్లో ప్రజల నాడి తెలుసుకున్న టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారని తెలిసింది. అయితే గెలుపు విషయంలో నాయకులకు ఇంకా టెన్షన్ మాత్రం అలాగే ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని హాట్ నియోజక వర్గాల్లో మొదటి వరుసలో ఉన్న పుంగనూరులో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చెయ్యడంతో ఆ ఊరు గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి ఇప్పటికే అనేక ఆరోపణలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల అధికారులు సైతం పుంగనూరు గురించి ప్రత్యేక ఆరా తీస్తున్నారని తెలిసింది.
పుంగనూరుకు మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ నియోజక వర్గానికి కేవలం 10 కిలోమీటర్లు దూరంలోనే కర్ణాటక రాష్ట్రం ఉంది. పుంగనూరు నుంచి వంద కిలోమీటర్లు దాటకుండానే తిమిళనాడు సరిహద్దు కూడా ఉంది. ఎన్నికల కౌంటింగ్ నాటికి కర్ణాటక నుంచి భారీ మొత్తంలో మద్యం పుంగనూరు నియోజక వర్గానికి వచ్చే అవకాశం ఉందని ఆరోపణలు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అన్ని పార్టీల నాయకులు మద్యం తరలించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టీడీపీ నుంచి చల్లా రామచంద్రా రెడ్డి, సొంత పార్టీ టిక్కెట్ తో బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరు నుంచి పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గంలోని ప్రజలు నాడి తెలుసుకోవడం పలు సర్వేలకు కూడా అంతు చిక్కలేదు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హవా పుంగనూరులో ఉన్నంత వరకు ఆయన్ను ఎవ్వరూ ఓడించలేరని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు. మొత్తం మీద పుంగనూరు నియోజక వర్గం సరిహద్దులోని చెక్ పోస్టుల్లో అధికారులు ప్రత్యేక నిఘా వెయ్యండం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications