డోంట్ మిస్: తిరుమలలో కన్నుల పండువగా ఆ వేడుకలు
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 64,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 19,838 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్ట్ మెంట్టు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

తిరుమలలో నవంబర్‌లో జరిగే పండగలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రబోధన ఏకాదశి, కార్తీక పౌర్ణమి గరుడ సేవ, కైశిక ద్వాదశి, కార్తీక వనభోజనం.. వంటి ఉత్సవాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా రోజుల్లో శ్రీవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు, సేవలను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు.
నవంబరు 1వ తేదీన ప్రబోధనై ఏకాదశి. దీన్ని దేవోద్ధాన ఏకాదశిగా కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే దేవ ఉత్థాన ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుండి మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. చాతుర్మాస వ్రతం ముగియడంతో పాటు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. అదే రోజున పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు.
2వ తేదీన కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అదే రోజున చాతుర్మాస దీక్ష సమాప్తి కార్యక్రమం ఉంటుంది. 5వ తేదీన కార్తీక పౌర్ణమి. దీన్ని పురస్కరించుకుని పౌర్ణమి గరుడసేవను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ జరుపుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
9వ తేదీన కార్తీక వన భోజనం కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 15న సర్వ ఏకాదశి, 17న ధన్వంతరి జయంతి. 18న మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 25వ తేదీన తిరుమంగైయాళ్వార్ ఉత్సవాలు ప్రారంభమౌతాయి.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications