Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GST: రేపటి నుంచి కొత్త జీఎస్టీ ధరలు, తగ్గే వస్తువుల లిస్ట్..తాజా ధరలు..!!

దేశ వ్యాప్తంగా పన్ను జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయి. రేపు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. చాలా రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దసరా వేళ జీఎస్టీ లో మార్పుల అమలు పైన ప్రధాని మోదీ జాతికి స్పష్టత ఇవ్వనున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ తాజా సంస్కరణల ద్వారా అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్యులకు మేలు జరుగుతుందని కేంద్రం చెబుతోంది.

జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టాక్ వరకు పాత ధరలతో అమ్మేందుకు అనుమతి ఇచ్చారు. తాజా రేట్లతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి. జీవన, ఆరోగ్య బీమా సేవలపై కూడా GST రేటును జీరోకు తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది. కొత్త రేట్ల ప్రకారం 18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువుల జాబితాలో సైనిక ఉపకరణాల భాగాలు (ఎగ్జెక్షన్ సీట్లు, డ్రోన్ బ్యాటరీలు, సముద్ర ఆయుధాలు మొదలైనవి) ఉన్నాయి. డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్ తో పాటుగా కళాకృతులు, పురాతన వస్తువులు ఉన్నాయి.

the-gst-council-approved-limiting-slabs-to-5-and-18-effective-from-september-22

అదే విధంగా 12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువుల జాబితాలో UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి, కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్), నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్ ఉన్నాయి. ఇక, 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన వస్తువుల జాబితాలో కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్ ఉన్నాయి. రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్, కాటన్, జ్యూట్ హ్యాండ్‌ బ్యాగ్స్, వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్, కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్, డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా ) టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి), నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్చ వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు ఉండటం వినియోగ దారులకు వెసులుబాటు కలగనుంది.

18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన వస్తువుల్లో టాల్కమ్ పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, షుగర్ కాన్ఫెక్షనరీ (మిష్టి, బతాషా మినహా), చాక్లెట్స్, కేక్స్, బిస్కెట్స్ కాఫీ, టీ ఎక్స్‌ట్రాక్ట్స్, ఐస్ క్రీమ్, మినరల్ వాటర్ (స్వీటెనర్ లేనివి) ఉన్నాయి. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడిన వస్తువుల్లో ఎయిర్ కండీషనర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్, టెలివిజన్ సెట్లు, సెట్ టాప్ బాక్స్‌లు, 1200cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/LPG/CNG వాహనాలు, 1500cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు, బస్సులు (బయో-ఫ్యూయల్స్‌పై నడిచేవి మినహా) ఉన్నాయి. 5 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన వస్తువులల బొగ్గు, లిగ్నైట్, పీట్ ఉండగా.. 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన వస్తువుల జాబితాలో రూ. 2500 కంటే ఎక్కువ విలువ ఉన్న దుస్తులు, కాటన్ క్విల్ట్స్, కొన్ని రకాల కాగితం, పేపర్‌బోర్డ్ ఉన్నాయి. 28 శాతం నుంచి 40 శాతానికి పెరిగిన వస్తువుల జాబితాలో పాన్ మసాలా , టొబాకో ఉత్పత్తులు (సిగరెట్లు, సిగార్లు, ఇతర టొబాకో రూపాలు), కెఫినేటెడ్ బీవరేజెస్, కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్ ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+