వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేతకు అసలు కారణం ఇదే: బయటపడ్డ ఈఎన్‌సీ లెటర్

Chandrababu Naidu: రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతోంది. దీన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.

ఈ తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. మూడు గంటల వ్యవధిలో పూర్తయ్యాయి. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో ఈ భవనం నిర్మాణాన్ని కూల్చివేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.

The land cannot be given to the YSRCP says ENC Narayana Reddy

ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.

సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్‌కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని, అయినప్పటికీ హుటాహుటిన బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు.

కాగా- పార్టీ కార్యలాయాన్ని నిర్మించుకోవడానికి ఈ స్థలాన్ని వైఎస్ఆర్సీపీకి కేటాయించలేదని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏకు ఆయన రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. నంబర్ 202/ఏ సర్వేలో మొత్తం 17.03 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, ఇందులో కృష్ణా వాటర్ ప్రధాన కాలువ కోసం 8.93 ఎకరాలు ఉన్నాయని, దీన్ని బోట్ యార్డ్ ఆధీనంలో ఉందని వివరించారు.

మరో 5.13 ఎకరాల స్థలం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉందని నారాయణరెడ్డి తెలిపారు. అవి పోగా- 2.97 ఎకరాలు మిగిలాయని చెప్పారు. ఈ స్థలం కూడా కృష్ణా జలాల ప్రధాన కాలువకు 100 మీటర్ల దూరంలో ఉందని గుర్తు చేశారు.

ఈ స్థలంలో ఏపీ నీరు, భూమి నిర్వహణ శిక్షణ ఇన్‌స్టిట్యూట్ (వాలంటి), ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ కార్యాలయాన్ని నిర్మించాలని జల వనరుల మంత్రిత్వ శాఖ భావించినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప- ఈ స్థలాన్ని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి వైఎస్ఆర్సీపీకి కేటాయించలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+