ఉలిక్కిపడిన విజయవాడ, ఇంద్రకీలాధ్రిపై దసరా వేడుకలు
విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వరుణదేవుడు తన ప్రతాపం చూపించడంతో విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులలో సంచరిస్తున్న వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడలోని ప్రధాన రహదారుల్లోని పలు ప్రాంతాల్లోకి చేరిన వర్షపు నీటిని తొలగించడానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు.
విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని తొలగించడానికి వీఎంసీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. విజయవాడలో భారీ వర్షాలు కురవడంతో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఎంత రంగరంగ వైభవంగా జరుగుతాయో, దసరా ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యే ముందు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో సంబంధిత అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. భారీ వర్షాలు కురిసినా కూడా ముందుగా అనుకున్న ప్రకారం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎప్పటిలాగే నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
భారీ వర్షాలు, వరదల దెబ్బకి విజయవాడ నగర అతలాకుతలం అయ్యింది. ఇటీవలే విజయవాడ నగర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద సాయం అందించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోతున్నారు. విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి పోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
విజయవాడ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు ఈ విషయంపై దృష్టి సారించాలని తెలిసింది. విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరోసారి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అందుబాటులో ఉండాలని మంత్రులు వీఎంసీ అధికారులు, సిబ్బందికి సూచించారని తెలిసింది. మరోసారి విజయవాడలో భారీ వర్షం కురవడంతో స్థానిక ప్రజలు టెన్షన్ పడుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications