లిక్కర్ షాపు సిండికేట్ అంటే తోలు తీస్తాం, పార్టీలు కాదు, వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి రావడంతో కథ రసవత్తరంగా మారుతుంది. ఆంధ్రప్రదశ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో పరిస్థితులు మారిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. జగన్ ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నూతన మధ్యాహ్నం విధానానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాప్ ల లైసెన్సుల కోసం భారీ ఎత్తున పోటీ ఉంది. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మద్యం వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్న వ్యాపారులు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీరియస్ అయ్యిందని తెలిసింది.

ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికార పార్టీ నాయకులు అందరికీ వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ షాపుల లైసెన్స్ విషయంలో జోక్యం చేసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత పార్టీ నాయకులతో పాటు లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం పోటీ పడుతున్న వారిని బెదిరిస్తున్న నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
బుధవారం విజయవాడలో ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ లిక్కర్ షాపుల లైసెన్స్ లు కావాలని దరఖాస్తుల కోసం వచ్చేవారికి పూర్తిగా సహకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులు లిక్కర్ షాప్ లైసెన్స్ విషయంలో జోక్యం చేసుకోకూడదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

లిక్కర్ షాప్ ల లైసెన్స్ ల సిండికేట్ కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సిండికేట్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ షాప్ లైసెన్స్ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తులుచేసుకోవడానికి సమయం కూడా పొడిగించమని, వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి కొల్లు రవీరంద్ర అన్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications