APలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దు! జుట్టు వదులుగా వదిలేయకూడదు!!
వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకోవద్దని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టంచేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర ధరించాలి లేదంటే చుడీదార్లు మాత్రమే వేసుకోవాలని సూచించింది. డీఎంఈ కార్యాలయంలో వారాంతపు సమీక్ష జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను బోధనాసుపత్రులకు పంపించారు. ప్రధానంగా ఈ డ్రస్ కోడ్‌ను ప్రస్తావించారు.
ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు ఇకనుంచి శుభ్రంగా ఉండే దుస్తులు ధరించడంతోపాటు గడ్డం గీసుకోవాలి. మహిళలు తమ జుట్టు వదిలేయకూడదు. స్టెతస్కోప్, యాప్రాన్‌ను తప్పనిసరిగా ధరించాలని డీఎంఈ కార్యాలయం సూచించింది. నిర్దేశించిన డ్రస్ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించడంలేదు.

ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సిన సందర్భం వస్తే.. వారివెంట సహాయకులు లేరని తిరస్కరించరాదని ఆదేశించింది. ఫేస్ రికగ్నైజ్డ్ హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు.
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడుదల రజని రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులతోపాటు ప్రధానమైన ఆసుపత్రులన్నింటినీ ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో తాను గుర్తించినవాటిని ఉన్నతాధికారులతో చర్చించి అమలు చేయిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక బోధానాసుపత్రి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications