లైంగిక శక్తిని పెంచే పండ్లు... తిన్నారా?
ఉద్యోగ జీవితంతోపాటు వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలామంది శృంగార సామర్థ్యం కోల్పోవడంతోపాటు లైంగిక కోరికలు క్షీణించిన అనుభవాలను ఎదుర్కొంటున్నారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తల్లిదండ్రులు కావాలనే కోరికతో ఉన్న దంపతులకు ఇది శాపంగా మారుతోంది. దీన్ని అధిగమించే విషయంపై దృష్టిసారించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడంవల్ల ఒత్తిడిని చాలావరకు అధిగమించవచ్చని తేలుతోంది. మనిషిలో లైంగిక కోరికను పెంచడంతోపాటు శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

అవకాడో: బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలుంటాయి. అవకాడో కామోద్దీపన పండుగా ప్రసిద్ధి చెందింది. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని పలు అధ్యయనాల్లో స్పషమవుతోంది.
అత్తిపండ్లు: అంగస్తంభన లక్షణాలను నిరోధించడంలో అత్తి పండ్లు దివ్యౌషధంలా పనిచేస్తాయి. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో అత్తిపండ్లు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి.
దానిమ్మ: రక్తహీనతను దూరం చేయడానికి పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు లైంగిక శక్తిని మెరుగుపరిచే లక్షణాలను కలిగివుంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
స్ట్రాబెర్రీలు: లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ప్రధానమైనవి. సంతానోత్పత్తి, శృంగార సామార్థ్యాన్ని ఈ పండ్లు మెరుగుపరుస్తాయి. విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పుష్కలంగా ఉంటాయి.
బీన్స్: కిడ్నీ, డయాబెటీస్ రోగులకు మేలు చేసే బీన్స్ సంతానోత్పత్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.












Click it and Unblock the Notifications