తిరుమల కిటకిట- జూన్ లో శ్రీవారికి నిర్వహించబోయే విశేష ఉత్సవాలు ఇవే

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు ఏకంగా 91,538 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 37,339 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

These important religious events set to take place at the Tirumala in June 2025

వేస‌వి సెల‌వుల కార‌ణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాల్లో 1,81,749 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేసవి సీజన్ లో ఇదే అత్యధికం. అంతకుముందు రెండు రోజులను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 3,28,702కు పెరుగుతుంది.

ఈ నాలుగు రోజుల్లో మొత్తం 10,98,170 మంది భ‌క్తుల‌కు టీటీడీ అన్న ప్ర‌సాదాలు అందించింది. 4,55,160 మంది భ‌క్తుల‌కు టీ/కాఫీ/పాలు/మ‌జ్జిగను సరఫరా చేసింది. ఈ నాలుగు రోజుల్లో 1,52,587 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. 12,172 మంది భ‌క్తులు వైద్య సేవ‌లు పొందారు.

కాగా- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో నిర్వహించబోయే విశేష ఉత్సవాలు, ప‌ర్వదినాల వివ‌రాలను టీటీడీ వెల్లడించింది. ⁠జూన్ 5వ తేదీన మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రంతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26న పెరియాళ్వార్ ఉత్స‌వారంభంతో ముగుస్తాయి.

9వ తేదీన శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమౌతుంది. అదే రోజున న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌ నిర్వహిస్తారు. ⁠11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు పరిస‌మాప్తమౌతాయి. 21న స్మార్త ఏకాద‌శి, 22న వైష్ణ‌వ మధ్వ ఏకాద‌శి కార్యక్రమాలను టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. 26న పెరియాళ్వార్ ఉత్స‌వం ఆరంభమౌతుంది.

టీటీడీ రూ.11 లక్షల విరాళం..

అమెరికా టెక్సాస్ కు చెందిన వేదాల రంగ‌నాథ్‌, కృష్ణ కుమారి దంప‌తులు సోమ‌వారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు 10 ల‌క్ష‌లు, ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు ల‌క్ష‌ రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేర‌కు తిరుమ‌ల‌లోని టీటీడీ ఛైర్మ‌న్ క్యాంపు కార్యాల‌యంలో బీఆర్‌ నాయుడుకు ఈ మొత్తంతో కూడిన డీడీల‌ను అంద‌జేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+