ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిలీజ్ కాని సినిమాలు!!

సినిమా తీయాలంటే కష్టంతో కూడుకున్న పని. దాన్ని విడుదల చేయాలంటే అంతకు మించిన కష్టం పడాలి. ఇప్పటికీ ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా ల్యాబ్స్ లో పడుంటాయి. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయికానీ గతంలో సినిమాను థియేటర్లో విడుదల చేసుకోవాలి.. శాటిలైట్ హక్కులు అమ్ముకోవాలి. అంతకుమించి ఆప్షన్ లేదు. మంచి ధర వస్తే ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేసుకోవచ్చు. చిన్న సినిమాలంటే బడ్జెట్ లేదు కాబట్టి విడుదలకు నోచుకోలేదనుకోవచ్చు. కానీ అగ్రహీరోలు నటించిన సినిమాలు కూడా విడుదలకు నోచుకోనివి ఉన్నాయి.

కొన్ని పేరున్న సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. వాటిగురించి ఆ సినిమాను తీసినవారు కూడా పట్టించుకోవడంలేదు. రవితేజ వరుసగా ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలు చేస్తూ జోరుమీదున్న సమయంలో అంతకుముందు చేసిన అన్వేషణ చిత్రాన్ని దర్శకుడు సాగర్ విడుదల చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న రవితేజ ఆ సినిమాను ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయవద్దని కోరినప్పటికీ విడుదలైంది. ఇప్పటికీ ఏళ్లు గడుస్తున్నా విడుదలకు నోచుకోని చిత్రాలను తెలుసుకుందాం.

movies1

* శాంతి నివాసం: చిరంజీవి హీరోగా మాధవి హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న సినిమా. దర్శకుడు బాబు. షూటింగ్ మొత్తం పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. అయితే హఠాత్తుగా నిర్మాత మరణించడంతో ఈ సినిమా విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది.
* భీమ: విక్రమ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పటివరకు విడుదలవలేదు.
* జాదు: '7 /జి బృందావన కాలనీ' ఫేమ్ రవి కృష్ణ హీరోగా ఇలియానా, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2007 లో విడుదల కావాల్సి ఉంది. తమిళంలో కేడీ పేరుతో విడుదలైనప్పటికీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు.
* ఇంటింటా అన్నమయ్య: కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2013-14లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ బయటకు రాలేదు.
* డీకే బోస్: సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కూడా 2013-14 లోనే విడుదల కావాల్సి ఉంది. అది కూడా బయటకు రాలేదు. కాలేదు.
* కోతి కొమ్మచ్చి: శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా .. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 2020లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలవల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
* దటీజ్ మహాలక్ష్మీ: హిందీలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన క్వీన్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. 2019లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ రిలీజవలేదు.
* అయినా ఇష్టం నువ్వు: నరేష్ కొడుకు నవీన్, కీర్తి సురేష్(ఫస్ట్ మూవీ) జంటగా నటించిన ఈ సినిమా 2016 లోనే విడుదల కావాల్సి ఉంది. అవలేదు.
* ధృవ నక్షత్రం: విక్రమ్, ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 2016 లో విడుదల కావాల్సి ఉందికానీ ఇప్పటికీ అది బయటకు రాలేదు.
* నా పేరు శివ2: పా రంజిత్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2014లో వచ్చిన 'మద్రాసి' చిత్రాన్ని తెలుగులో 'నా పేరు శివ 2' పేరుతో విడుదల చేస్తున్నట్లు 2022 ఆరంభంలో ప్రకటించారు. ఇప్పటికీ విడుదల కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+