Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దొంగలకే చుక్కలు చూపించిన అమ్మోరు! ఈ స్టోరీ తెలిస్తే పడీపడీ నవ్వుతారు!

ఇటీవల కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక గుడిలో దేవుడు సొత్తును దొంగతనం చేసేవారు కూడా బాగానే పెరిగారు. అయితే ఈ దొంగతనాలకు పోలీసులు కూడా చెక్ పెడుతున్నారు. సీసీ కెమెరాలు, సహాయంతో టెక్నాలజీ సహాయంతో దొంగతనాలు చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక ఆలయంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు చేదించక ముందే దొంగతనం చేసిన దొంగలు దేవుడి డబ్బులు తిరిగి ఆలయంలోనే పెట్టేసి వెళ్ళారు.

ముసలమ్మ ఆలయంలో చోరీ... మళ్ళీ ఆలయానికే చేరిన చోరీ సొత్తు
దేవుడి సొమ్ము తిరిగి ఇవ్వటమే కాదు దానితో పాటు ఓ లేఖను కూడా వదిలి వెళ్ళడం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ముసలమ్మ దేవాలయంలో నెలరోజుల క్రితం దొంగలు హుండీని చోరీ చేశారు. అయితే చోరీ చేసిన సొత్తును తిరిగి నిన్న రాత్రి ఆలయంలోనే వదిలేసి వెళ్లారు. దాంతోపాటు దొంగలు ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు.

Thieves returned the money to god stolen from the temple hundi and leave a letter

దొంగలు వదిలి వెళ్ళిన లేఖలో ఆసక్తికర అంశాలు
దొంగలు పడేసి వెళ్లిన చోరీ చేసిన సొత్తును పోలీసుల సమక్షంలో స్థానికులు లెక్కించారు. అది అక్షరాల 1, 06 వేల 486 రూపాయలుగా లెక్క తేలింది. ఆ సొత్తు తో పాటు వారు ఒక లేఖను కూడా వదిలి వెళ్లడంతో ఆ లేఖను స్థానికులు ఆసక్తిగా చదివారు. ఆ లేఖలో దొంగలు హుండీని నలుగురం కలిసి చోరీ చేశామని పేర్కొన్నారు. అయితే దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండడం లేదని పేర్కొన్నారు.

భయంతో నగదు, లేఖ వదిలి వెళ్ళిన దొంగలు
భయంతో అమ్మవారి డబ్బులు ఆలయం దగ్గరే వదిలేసి వెళుతున్నట్టు రాసి పెట్టారు. ఇక ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం చేసిన నగదును తిరిగి దొంగలు వదిలి వెళ్లడంతో ఇదంతా అమ్మవారి మహత్యం అంటూ స్థానికులు ముసలమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు.

ఆశ్చర్యం కలిగిస్తున్న చోరీ కేసు
సహజంగా చోరీలకు పాల్పడేవారు ఆలయాలలో దొంగతనాలు చేసినప్పటికీ, చోరీ చేసిన నగదును తిరిగి మళ్లీ వెనక్కు తెచ్చి పెట్టే దాఖలాలు ఉండవు. కానీ బుక్కరాయసముద్రం లోని ముసలమ్మ దేవాలయంలో చోరీ చేసిన డబ్బును తిరిగి దొంగలు గుడికే చేర్చడం ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తుంది. దొంగలకు అమ్మవారి పట్ల భక్తి ఉండడం, భయం ఉండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+