పవన్ కళ్యాణ్ పైనే తొలిసారి కాదు, రాజకీయమని..!

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ఓ డై హార్డ్ ఫ్యాన్ ఇటీవల యాభై రూపాయల నోటు పైన ఉంచి ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే, తాము అభిమానించే వారి పైన ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోను ఇలాంటివి జరిగాయి.

2011 ప్రపంచ కప్ సమయంలో, సచిన్ టెండుల్కర్ 99వ అంతర్జాతీయ శతకం చేసినప్పుడు ఓ అభిమాని సచిన్ ఫోటోను వంద రూపాయల నోటు పైన వేశాడు. అవి అడ్వర్టైజింగ్ బోర్డుల పైన కూడా కనిపించాయట. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా యాభై రూపాయల నోటు పైన మార్ఫింగ్ చేశారు.

Pawan Kalyan

అలాగే, టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం చిత్రాన్ని వంద రూపాయల డాలర్ పైన వేశారు. బెంజిమిన్ ఫ్రాంక్లిన్ స్థానంలో బ్రహ్మానందం ఫోటోను ఉంచారు. గతంలో చాలా జరిగినప్పటికీ వీటి పైన ఫిర్యాదులు అందలేదని అంటున్నారు.

తెలుగు సినీ అభిమానులు తమ తమ అభిమాన నటుల చిత్రాలను మార్ఫింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. హీరో, ప్రస్తుత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోటోలను క్యారీకేచర్‌గా వేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు.

బ్రహ్మానందం ముఖాన్ని పాపులర్ ఇంగ్లీష్ చిత్రాల నటులతో, ముఖ్య నేతలతో రీప్లేస్ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బరాక్ ఒబామా, అబ్దుల్ కలాం, వివేకానంద స్వామి తదితరాలతో బ్రహ్మానందం ముఖాన్ని రీప్లేస్ చేశారు. దీనిపై బ్రహ్మానందం ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, గతంలోను ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ.. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే ఫిర్యాదు కేవలం రాజకీయ ప్రేరణే అని అప్పుడే కొట్టేసిన వారు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+