మే 5న మొదటి చంద్ర గ్రహణం...
హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ మాసం పౌర్ణమి. దీన్ని ఖగోళ సంఘటనగా చూస్తారు. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణానికి ముందు సూతకాలం ప్రారంభమవుతుంది.
2023 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం 2023 మే 5 శుక్రవారం రాత్రి 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. ఈ గ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం అవుతుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం కూడా చెల్లదు. యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.

గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. అది గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. గర్భిణులు బయటకు రాకూడదు. భూమి నీడ చంద్రునిపై పడనప్పుడు దానిని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అని పిలుస్తారు. గ్రహణం దాని పూర్తి పరిమాణంలో మాత్రమే కనిపడటమే కాకుండా కాస్తంత అస్పష్టంగా ఉంటుంది. 2023లో రెండో చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం అవుతుంది.
భారతదేశం నుంచి కనిపించదు కాబట్టి ఈ సంవత్సరం సంభవించే చంద్రగ్రహణంలో సూతక్ కాలం చెల్లదు. గ్రహణం సంభవించినప్పుడు రాహువు, తువుల నీడ రాశిచక్ర గుర్తులపై ప్రసరిస్తుంది. దీనినే సూతక్ కాలంగా భావిస్తారు. ఈ సమయంలో దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలు మూసేస్తారు. తినడం, పడుకోవడం వంటివి కూడా నిషేధం.












Click it and Unblock the Notifications