పవన్ సమర్ధతకు బీజేపీ పరీక్ష- టీడీపీతో పొత్తుకు అదే కీలకం..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్..తెలంగాణలో బిజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణలో టీడీపీ పోటీలో లేదు. ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఏపీలో టీడీపీ, జనసేన తో పాటుగా బీజేపీ కూడా తమతో కలిసి రావాలని ఆ రెండు పార్టీల నేతలు కోరుకుంటున్నారు. అయితే, బీజేపీ ఇప్పుడు పవన్ కు బిగ్ టాస్క్ ఇచ్చింది. ఈ ఫలితమే ఏపీలో పొత్తులను డిసైడ్ చేయనుంది.

బీజేపీ కొత్త లెక్కలు : ఏపీలో పవన్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు నిర్ణయం ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉంటూనే టీడీపీతో పొత్తు ప్రకటించటం పైన బీజేపీ ఎక్కడా స్పందించలేదు. పవన్ తమతోనే ఉన్నారని చెబుతూ వచ్చింది. అటు పవన్ తాను ఏ సమయంలో పొత్తు ప్రకటించాల్సి వచ్చిందో బీజేపీ నేతలకు వివరిస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తుకు సిద్దమైంది. దీంతో, వీరికి వ్యతిరేకంగా పోటీలో ఉంటే ఏపీలో ప్రయత్నాలకు నష్టమని భావించి..టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. చంద్రబాబు నిర్ణయంతో ఇప్పుడు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఎవరికనే చర్చ మొదలైంది. తెలంగాణలో టీడీపీ మద్దతు దారులు..సానుభూతి పరులు ఈ సారి కాంగ్రెస్ కే ఓటు వేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Three Main parties trying to win TDP sympathizers votes in Telangana, Who will get support

ఆ ఓట్ బ్యాంక్ ఎవరికి : ఇదే సమయంలో బీజేపీ ఏపీకి చెందిన వారి ఓట్లను పవన్ ద్వారా సాధించే ఆలోచనలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే సీట్ల ఎంపికలోనూ ఆచి తూచి వ్యవహరించి..కీలక స్థానాలను జనసేనకు అప్పగించింది. ఇప్పుడు ఏపీ ఓటర్లతో పాటుగా టీడీపీ మద్దతు దారుల ఓట్లు ఏ మేర పవన్ పొందుతారనేది తేల్చేందుకు బీజేపీ దీనికి ఒక కొలమానంగా తీసుకుంటోంది.

చంద్రబాబు జైలుకు వెళ్లి కష్టంలో ఉన్న సమయంలో పవన్ అండగా నిలిచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో తన పార్టీ అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారి ఓట్లను పవన్ తనకు అనుకూలంగా మళ్లించుకోవటంలో సక్సెస్ అవుతారా.. లేక వారంతా కాంగ్రెస్ వైపే నిలుస్తారా అనేది కీలకంగా మారనుంది. ఇక్కడే చంద్రబాబు - పవన్ ఏంటనేది స్పష్టత వస్తుందనేది బీజేపీ లెక్కగా కనిపిస్తోంది.

పవన్ సమర్ధత తేల్చేలా : ఇప్పటికే టీడీపీకి అండగా నిలిచే ప్రముఖులు సైతం తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తామని ఓపెన్ గా చెబుతున్నారు. తెలంగాణలో ఇదే జరిగితే బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేనతో కలవటం పైన పునరాలోచన చేసే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ ను బీజేపీ కట్టడి చేస్తుందనే అభిప్రాయం ఉంది. ఏపీలో టీడీపీతోనే కొనసాగుతూనే బీజేపీని తమ వైపు తిప్పుకోవాలనే జనసేనాని ప్రయత్నాలు సైతం ఇక్కడి ఫలితం ఆధారంగానే ఉండనుంది.

కాంగ్రెస్ వైపు వీరి ఓట్లు మళ్లితే పవన్ ఆలోచనలకు బీజేపీ బ్రేక్ వేయటం ఖాయమని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో పవన్ ఏ మేర ప్రభావం చూపిస్తారనేది ఇక్కడ కీలకమే. దీంతో..తెలంగాణలో ఫలితాలు..బీజేపీ - జనసేన కు వచ్చే సీట్లు...ఓట్లు..పవన్ ద్వారా కలిగే ప్రయోజనం ఆధారంగా ఏపీలో పొత్తులు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+