Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెక్స్‌వర్కర్ల వీరంగం!: జూనియర్ ఆర్టిస్ట్‌పై రాళ్ల దాడి, అర్ధనగ్న ప్రదర్శన

హైదరాబాద్: సికింద్రాబాదులో సెక్స్ వర్కర్లు కొందరు రెచ్చిపోయారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను వెంటపడి మరీ కొట్టారు. పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్తే.. పోలీసులనే నివ్వెరపోయేలా చేశారు. ఇది గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

శివ కుమార్‌ అనే జూనియర్‌ ఆర్టిస్ట్‌ గుంటూరు వెళ్లేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ వెళ్లారు. టికెట్‌ తీసుకుని కౌంటర్‌ వద్ద ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ రూం ముందు నిలబడి ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మహిళలు ఆయన దగ్గరకు వచ్చి యాచించారు. అతడు కొంత చిల్లర ఇచ్చాడు.

Three women beat Junior Artist in Hyderabad

దాంతో ఆయన్ను ఆ ముగ్గురు మహిళలు కిందామీదా చూశారు. జేబులో ఉన్న మొత్తం డబ్బును తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. బిత్తరపోయిన అతను అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతను వెళ్లిపోతుంటే వెంటాడి రాళ్లతో దాడి చేశారు.

Three women beat Junior Artist in Hyderabad

గొడవను చూసి పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు మహిళలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ వారు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బట్టలు విప్పేసి, అర్ధనగ్నంగా ప్రదర్శన ఇచ్చారు. పోలీసులు నివ్వెరపోయారు. కాగా, పోలీసులు వారిని ఉసిగొల్పుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, వారు వ్యభిచారులని, యాచకులు అని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+