• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టి బిల్లు హీట్: అసెంబ్లీ వద్ద మూడో కన్ను (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఎపిఎన్జీవోలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసాధారణ రక్షణ చర్యలు తీసుకున్నారు. రెండంచెలుగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

అసెంబ్లీలోకి ప్రవేశించే ప్రతి గేటు వద్ద ఐపిఎస్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు ఈసారి రెండు కిలోమీటర్లకు పొడిగించారు. నిషేధిత ప్రాతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులో ఉన్న సిబ్బందితోపాటు ఇతర జిల్లా లు, కేంద్ర బలగాలను భద్రతకు ఉపయోగిస్తున్నారు. భారీగా సిసి కెమెరాలు, హ్యాండీ క్యామ్‌లు, ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీ భద్రతకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అసెంబ్లీ 1

అసెంబ్లీ 1

అసెంబ్లీ భద్రతకు పలువురు ఐపిఎస్ అధికారులతో పాటు ఆరుగురు చొప్పున అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, పదహారు మంది ఇన్‌స్పెక్టర్లు, సుమారు ఐదువందల మంది సిబ్బంది, 26 ఎపిఎస్పీ ప్లాటూన్లు, సిఆర్‌పిఎఫ్ బలగాలను రంగంలోకి దించారు.

అసెంబ్లీ 2

అసెంబ్లీ 2

శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈసారి మంటలు రేగనున్నాయి. రాష్ట్ర విభజన ముంగిట జరుగుతున్న సమావేశాలు కావడంతో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

అసెంబ్లీ 3

అసెంబ్లీ 3

ప్రతిసారీ వాయిదా తీర్మానాలతో ముందుండే ప్రతిపక్షాలు ఈసారి సభ సాఫీగా సాగాలని తమ ప్రాంత అభిప్రాయాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలపాలని కోరుకుంటున్నాయి.

అసెంబ్లీ 4

అసెంబ్లీ 4

దీంతో ఈసారి సమావేశాలు అధికార, విపక్షాల మధ్య సమరంలా కాకుండా రెండు ప్రాంతాల మధ్య జరిగే యుద్ధంలా మారనుందని భావిస్తున్నారు. ఎపిఎన్జీవోలు చలో అసెంబ్లీ ముట్టడికి సిద్ధంగా ఉన్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

అసెంబ్లీ 5

అసెంబ్లీ 5

అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ, 18వ తేదీ వరకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ బిల్లు చర్చకు వస్తే సమావేశాలను పొడిగిస్తారు.

అసెంబ్లీ 6

అసెంబ్లీ 6

సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది.

అసెంబ్లీ 7

అసెంబ్లీ 7

కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన కౌన్సిల్ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశమై అజెండాను ఖరారు చేసింది. ఉభయ సభల బిఎసి సమావేశాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైర్హాజరయ్యారు.

అసెంబ్లీ 8

అసెంబ్లీ 8

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి హాజరయ్యారు.

అసెంబ్లీ 9

అసెంబ్లీ 9

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. రెండు కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు.

English summary
Andhra Pradesh Assembly winter sessions are started from today and this sessions is going to get importance because of the AP state Reorganization Bill 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X