ప్రయాణికుల ఆదరణ కరువైన ఏపీ ఎక్స్‌ప్రెస్: రద్దు చేసే ఆలోచనలో రైల్వే శాఖ?

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆక్సుపెన్సీ రేటు అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. విమాన టికెట్‌ను తలపించే చార్జీలు, వేళగాని వేళలో ఈ రైలు ప్రయాణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... సరిగ్గా 12 నెలల క్రితం ఆగస్టు 12న ఈ సూపర్‌ ఫాస్ట్ రైలుని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించారు. మొదట్లో వారానికి మూడు రోజులే నడిచిన ఈ రైలును నాలుగు నెలల తర్వాత ప్రతిరోజూ నడుపుతున్నారు. ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి.

అందులో ఏసీ ఫస్ట్‌క్లాస్‌ ఒకటి, సెకండ్‌క్లాస్‌ 5, థర్డ్‌క్లాస్‌కు 7 బోగీలతో పాటు ప్యాంట్రీ ఉన్నాయి. కాగా ఈ రైలులో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఫస్ట్‌క్లాస్ టికెట్ చార్జి రూ.5075, సెకండ్ క్లాస్ రూ.2940, థర్డ్‌క్లాస్ రూ.2005 ఉంది. ఇక విశాఖ టు ఢిల్లీ మధ్య దూరం 2099 కిలోమీటర్లు.

Time delayed in ap express, govt to may cancel the train

ఈ దూరాన్ని ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో 35 గంటల 15 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రైలులో అన్ని గంటలు కూర్చోలేక కొంచెం స్థోమత కలిగి ఉన్నవారు విమానాల్లోని ఢిల్లీ వెళ్లిపోతున్నారు. అయితే విమాన చార్జీలను భరించలేని వారు మాత్రం రైలులోనే వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

22415 నెంబర్‌తో విశాఖలో ఉదయం ఈ రైలు 7.15కి బయల్దేరి మర్నాడు రాత్రి 7 గంటలకు రాజధాని ఢిల్లీకి చేరుకుంటుంది. దీంతో ఆరోజు రాత్రికి ఢిల్లీలో తప్పనిసరిగా బస చేయాల్సి వస్తుంది. ఇది ప్రయాణికులకు ఎంతో భారంగా పరిణమిస్తోంది. దీంతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతానికి మించడం లేదు. ఫలితంగా నష్టాల పట్టాలపై ఈ బండి పరుగులు తీస్తోంది.

నిజానికి ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ టెక్నాలజీతో తయారు చేసిన బోగీలను అమర్చారు. ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొం4:23 PM 7/7/20164:23 PM 7/7/20164:23 PM 7/7/2016దించారు. కానీ ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లేందుకు మాత్రమే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అయితే రైలు సగటు వేగం మాత్రం గంటకు 59 గంటలకు మించడం లేదు.

దీంతో ఈ రైలులో ప్రయాణించేందుకు ఎవరూ ఆసక్తిని కనబర్చడం లేదు. మరోవైపు విశాఖ నుంచి నిజాముద్దీన్‌కు ఈ రూట్‌లో వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 37 గంటలకే అక్కడికి చేరుకోవడం విశేషం. దీంతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ఈ రైలుకు డిమాండ్ ఉంది.

దీంతో ఈ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు వేగం పెంచాలని, ఉదయం వేళ ఢిల్లీ చేరుకునేలా విశాఖ నుంచి బయల్దేరే వేళలు మార్చాలని గత కొంత కాలంగా ప్రయాణికులు ఎప్పట్నుంచో కోరుతున్నా రైల్వే అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కొన్ని రోజుల పాటు ఇలాగే నడిపి చివరకు ప్రయాణికులు ఆదరణ లేదని రైలు రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Time delayed in ap express from Visakhapatnam to New delhi , govt to may cancel the train.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి