ఏపీలో ధనిక జిల్లా ఏదంటే ? ఎన్టీఆర్-కృష్ణాను వెనక్కి నెట్టబోతున్న తిరుపతి ! తాజా అంచనాలివే..!

ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో అత్యంత ధనిక జిల్లా ఏది, మిగతా జిల్లాల పరిస్దితి ఏంటి ? అత్యంత పేద జిల్లాలు ఏవి ? ఇవన్నీ తెలుసుకోవాలంటే తాజాగా వెలువడిన జిల్లా స్ధూల ఉత్పత్తి అంచనాల జాబితా చూడాల్సిందే. తాజాగా విడుదలైన ఈ అంచనాల జాబితా చూస్తే ఆంధ్రప్రదేశ్ తాజా ఆర్దిక పరిస్దితి, అందులో జిల్లాల భాగస్వామ్యం ఎలా ఉందో మనకు అర్దమవుతుంది. రాజధానిగా ఉన్న అమరావతి ఆర్ధిక స్ధితి ఎలా ఉందో కూడా తెలుస్తుంది.

ఏపీలో జిల్లాల వారీగా స్ధూల ఉత్పత్తిని ప్రతిబింబించే జీడీడీపీ అంచనాల తాజా జాబితా విడుదలైంది. 2028-29 సంవత్సరాని కల్లా రాష్ట్రంలో వివిధ జిల్లాల పరిస్దితి ఎలా ఉండబోతోందన్నది ఇందులో అంచనా వేశారు. ఇందులో విశాఖపట్నం జిల్లా టాప్ లో నిలిచింది. ప్రస్తుతం రెండో స్దానంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా, మూడో స్ధానంలో ఉన్న కృష్ణాజిల్లా ఒక్కో ర్యాంక్ దిగజారి, మూడు, నాలుగు స్ధానాలల్లో నిలబోతున్నాయి.

Tirupati inch closer to become second richest district in ap after Visakhapatnam by 2028-29

అలాగే నాలుగో స్దానంలో ఉన్న తిరుపతి జిల్లా ఎన్టీఆర్-కృష్ణా జిల్లాల్ని వెనక్కి నెట్టి రెండో స్దానానికి చేరబోతోంది. ఐదో స్ధానంలో ఏలూరు, ఆరో స్ధానంలో అనంతపురం, ఏడో స్ధానంలో నెల్లూరు, ఎనిమిదో స్ధానంలో గుంటూరు, తొమ్మిదో స్ధానంలో ప్రకాశం, పదో స్ధానంలో తూర్పు గోదావరి ఉండబోతున్నాయి. ప్రస్తుతం 11వ స్ధానంలో ఉన్న వైఎస్సార్ జిల్లా 2028-29 నాటికి ఒక స్ధానం ఎగబాకి పదో స్ధానానికి చేరుతుందని అంచనా. దీంతో పదో స్ధానంలో ఉన్న తూర్పుగోదావరి కాస్తా 11వ స్ధానానికి పడిపోనుంది.

12వ స్ధానంలో కాకినాడ, 13వ స్ధానంలో పశ్చిమగోదావరి, 14వ స్ధానంలో కర్నూలు, 15వ స్ధానంలో అనకాపల్లి, 16వ స్ధానంలో శ్రీ సత్యసాయి, 17వ స్ధానంలో పల్నాడు, 18వ స్ధానంలో చిత్తూరు, 19వ స్ధానంలో అంబేద్కర్ కోనసీమ, 20వ స్దానంలో శ్రీకాకుళం, 21వ స్ధానంలో బాపట్ల, 22వ స్ధానంలో నంద్యాల, 23వ స్ధానంలో అన్నమయ్య, 24వ స్ధానంలో విజయనగరం, 25వ స్ధానంలో పార్వతీపురం మన్యం, 26వ స్ధానంలో అల్లూరి సీతారామరాజు ఉన్నాయి. ప్రస్తుతం 22వ స్ధానంలో ఉన్న నంద్యాల 2028-29 నాటికి 23వ స్ధానానికి పడిపోతుండగా.. 23వ స్ధానంలో ఉన్న అన్నమయ్య జిల్లా 22వ స్ధానానికి ఎగబాకనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+