తిరుపతి ప్రయాణికులకు అలర్ట్- ఈ 10 రైళ్లకు స్టేషన్, టైమింగ్స్ మార్పు..!

తిరుపతి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇవాళ కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుపతి మీదుగా ప్రయాణించే 10 వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు టెర్మినల్ స్టేషన్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా రైళ్ల టైమింగ్స్ లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాబట్టి తిరుపతి నుంచి ప్రయాణాలు చేసే వారు ఈ మార్పులు గమనించాల్సి ఉంటుంది.

ఆపరేషన్స్ కారణాలతో 10 ఎక్స్ ప్రెస్ రైళ్లకు తిరుపతి నుంచి తిరుచానూరుకు టెర్మినల్ స్టేషన్ మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి జల్నా నుంచి తిరుచానూరుకు ప్రయాణించే రైలు నంబర్ 07609 రైలు రేణిగుంటలో 9.28కి, తిరుచానూరులో 10.45కు చేరుకుంటుంది. అలాగే ఈ నెల 13 నుంచి తిరుచానూరు నుంచి జల్నాకు వెళ్లే రైలు నంబర్ 07610 తిరుచానూరులో మధ్యాహ్నం 3.20కి బయలుదేరుతుంది. రేణిగుంటలో 3.35కు ఆగనుంది.

Tirupati to Tiruchanur Railway Alters Terminal for 10 Weekly Express Trains Updates Timings

అలాగే ఈ నెల 15నుంచి చర్లపల్లి నుంచి తిరుచానూరుకు వచ్చే రైలు నంబర్ 07251 రేణిగుంటకు ఉదయం 5.58కి, తిరుచానూరుకు 8 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 15 నుంచి తిరుచానూరు నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 07252 తిరుచానూరులో సాయంత్రం 4.55కు బయలుదేరుతుంది. రేణిగుంటలో 5.14కు చేరుకుంటుంది. అలాగే ఈ నెల 11 నుంచి నాందేడ్ నుంచి తిరుచానూరుకు వచ్చే రైలు నంబర్ 07015 రేణిగుంటకు 10.28కి చేరుకుంటుంది. తిరుచానూరుకు 11.30కు చేరుకుంటుంది. అటు తిరుచానూరు నుంచి నాందేడ్ కు వెళ్లే రైలు నంబర్ 07016 రాత్రి 7.50కి తిరుచానూరులో బయల్దేరి రాత్రి 8.05కి రేణిగుంటకు చేరుకుంటుంది.

Tirupati to Tiruchanur Railway Alters Terminal for 10 Weekly Express Trains Updates Timings

ఈ నెల 9 నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుచానూరు వచ్చే రైలు నంబర్ 07009 ట్రైన్ ఉదయం 8.58కి రేణిగుంటకు వచ్చి 10.30కి తిరుచానూరుకు చేరుకుంటుంది. అలాగే తిరుచానూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు నంబర్ 07010 ట్రైన్ సాయంత్రం 4.40కి తిరుచానూరులో బయల్దేరి 4.55కి రేణిగుంటకు చేరుకుంటుంది. అలాగే ఈ నెల 12 నుంచి చర్లపల్లి నుంచి తిరుచానూరు వచ్చే రైలు నంబర్ 07017 ట్రైన్ ఉదయం 8.58కి రేణిగుంటకు చేరుకుని, 11.15కు తిరుచానూరు వెళ్తుంది. అలాగే తిరుచానూరు నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు నంబర్ 07018 ట్రైన్ సాయంత్రం 4.40కి తిరుచానూరులో బయల్దేరి 4.55కు రేణిగుంటకు చేరుకుంటుంది. ఇతర స్టేషన్లలో మాత్రం ఈ రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+