Kota Srinivasa Rao : నేను బతికే ఉన్నా-పుకార్లతో పోలీసులు కూడా వచ్చేశారు..వీడియో రిలీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం అంటూ వచ్చిన పుకార్లతో ఆయన ఇంటికి పోలీసులు భద్రత కల్పించేందుకు వచ్చారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) చనిపోయినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు ఆ వార్తల సారాంశం. అసలే టాలీవుడ్ లో పలువురు దిగ్గజ నటులు ఈ మధ్య వరుసగా చనిపోయిన నేపథ్యంలో వయో వృద్ధుడైన కోటా శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు పలువురు భావించారు కూడా. ఆయన అభిమానులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు.

అంతేకాదు కోటా శ్రీనివాసరావు మరణంపై వచ్చిన పుకార్లతో హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు కూడా భద్రత కల్పించేందుకు వచ్చారు. కోటా గురించి తెలిసిన వారే కావడంతో స్ధానిక పోలీసులు ఆయన మరణ వార్త తెలుసుకుని వచ్చే వారితో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భద్రత కల్పించేందుకు వచ్చారు. అలాగే కోటా శ్రీనివాసరావు చనిపోయారా అంటూ ఆయన ఫోన్ కే ఉదయం నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి. దీంతో ఆయన షాకవుతూనే సమాధానం ఇస్తున్నారు. ఇక వీటికి అడ్డుకట్ట వేద్దామని భావించి ఆయనే దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో బైట్ విడుదల చేశారు.

tollywood senior actor kota srinivasa rao shocked over his death rumours, released video byte

తాను బతికే ఉన్నానని, తన అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టాలీవుడ్ నట దిగ్గజం కోటా శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి వార్తలు ఇచ్చే ముందు సరిచూసుకోవాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. తన మరణవార్త పేరుతో వస్తున్న పుకార్లను నమ్మొద్దని తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల్ని కోటా కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, రేపు ఉగాది కావడంతో పండుగ ఏర్పాట్లలో ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారందరికీ గట్టి షాక్ తగిలినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+