టమోటా ధర ఆల్‌టైం రికార్డు - సెంచరీ దాటేసిన కిలో రేటు : ఏ కూర అయినా రూ 60 పైనే...!!
ఎప్పుడూ వినని విధంగా టమోటా ధరలు పెరిగిపోయాయి. చూడటమే మినహా..కొనలేని ధరకు చేరుకున్నాయి. అదొక్కటే కాదు..కూరగాయలు ఏం కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే పలుకుతోంది. ఇక టమాట ధరలైతే ఆకాశన్నంటుతున్నాయి. టమోటా మార్కెట్ కు పేరున్న చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా అత్యధిక ధర పలికింది. సోమవారం మార్కెట్‌లో మొదటిరకం టమాటా ధర కిలో రూ.104 వరకు పలికింది.

మదనపల్లె మార్కెట్ లో రికార్డు ధర
మదనపల్లె, తంబళ్లపల్లె, కర్ణాటకలోని శ్రీనివాసపురం, రాయల్పాడు తదితర ప్రాంతాల నుంచి రైతులు సోమవారం మార్కెట్‌కు 260 మెట్రిక్ టన్నుల టమాటాను తీసుకువచ్చారు. వాటిలో మొదటిరకం టమాటా కిలో రూ.60-104 వరకు ధర పలికింది. రెండోరకం టమాటా ధరలు కిలో రూ.18-58 మధ్య నమోదయ్యాయి. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, తుపానులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో టమాటా పంట బాగా దెబ్బతింది. ప్రజావసరాలకు సరిపడా టమాటా మార్కెట్‌లో దొరకడం లేదు. వారం రోజులుగా మదనపల్లె డివిజన్ పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి.

చెన్నైలో కిలో టమోటా ధర రూ 140
కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం, వర్షం దెబ్బకు పంట నాణ్యత కోల్పోవడం, డ్యామేజీ అధికంగా ఉండడం వంటి కారణాలతో సరుకు లభ్యత కష్టమవుతోంది. సాధారణంగా చలికాలంలో కేజీ రూ.20 నుంచి 30 టామటాల ధరలు తెలుగు రాష్ట్రాల్లో సహా దక్షిణాది రాష్ట్రాల్లో రూ.100 దాటి పరుగులు తీస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది.

భారీ వర్షాలు..వదరలే కారణమా
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమిళనాడు, కర్ణాటకలో కిలో ధర ఎన్నడూ లేనంతగా రూ.వంద దాటేసింది. దేశంలోనే అత్యధికంగా టమాటాలు పండే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. అయితే.. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంటున్నారు.
Recommended Video

మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వ్యాపారులు
దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్‌లో టామోట డిమాండ్ మరింత పెరిగినట్లు చెబుతున్నారు. కాగా.. పెరిగిన టమోట ధరలు మరో నెల రోజుల వరకు తగ్గడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమాటా.. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్, ఛత్తీస్‌గడ్ లోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే వస్తున్నాయి.
నవంబర్ నెల మొదట్లో టమాట కేజీ ధర రూ.20నే ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్నంటింది. దీనికి ప్రధాన కారణం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలేనని వ్యాపారులు పేర్కొంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications