మంట పుట్టిస్తోన్న టమాటా..
నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. మూడురోజుల క్రితం వరకు కిలో రూ.20, రూ.30గా ఉన్న ధర ఒక్కసారిగా రూ.100కి చేరింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర సెంచరీ కొట్టింది. అన్ని రాష్ట్రాల్లోను ఇదేతీరు కనిపిస్తోంది. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటమే దీనికి కారణం.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.80కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో హోల్‌సేల్ ధర కిలో రూ.80 నుంచి రూ.90 వరకు ఉండగా, రిటైల్‌లో మాత్రం రూ.100 దాటింది. కాన్పూర్ కు బెంగళూరు నుంచి టమాటాలు వస్తాయని.. రానున్న రోజుల్లో ఇవి కిలో రూ.150కి చేరుకోవచ్చంటున్నారు. ముంబయిలో కూడా రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. హోల్‌సేల్‌లోనే కిలో ధర రూ.50 ఉంది. మొన్నటివరకు బెంగళూరులో రూ.30గా ఉన్న టమాటాల ధర రూ.100కి చేరింది. తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో టమాటా ధరపై ప్రభావం పడింది. హైదరాబాద్‌లో నాణ్యమైన టమాటా ధర రూ.100కంటే ఎక్కువే ఉంది.

మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లలో టామాటా ఎక్కువగా సాగవుతుంటుంది. తీవ్ర వడగాడ్పులతో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు కనిపించడంతో రైతులు సంతోషించారు. అయితే భారీ వర్షాలవల్ల కొన్నిచోట్ల పంట దెబ్బతింటోంది.
దేశంలో టమాటా సాగు అధికంగా ఉంటుంది.
ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకు తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తింటోంది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో పంట దెబ్బతింది. దాదాపు తెలంగాణలోను ఇదే పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications