Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిగొచ్చిన టమోటా ధరలు, కిలో ఎంతంటే - మరోసారి పెరుగుతాయా..!!

సామాన్యులకు గుడ్ న్యూస్. నిన్నటి వరకు బెంబేలెత్తించిన టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల టమాట ధరలు తగ్గాయి. ఇక ఒకటి, రెండు రోజుల్లో కిలో టమాట రూ.200 దాటిన పరిస్థితుల్లో టమాట సామాన్యులు, పేదలను కరుణించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో కిలో టమాట రూ.65కు లభిస్తోంది. అయితే, మరలా ధరలు పెరిగే అవకాశం ఉందా.

తగ్గుతున్న టమోటా ధరలు:సామాన్యులకు చుక్కలు చూపించిన టమోటా ధరలు దిగి వస్తున్నాయి. కిలో టమోటా ధర దాదాపు రూ 60 - రూ 65 మధ్య ప్రస్తుతం అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో తాము కొనుగోలు చేసామంటూ బయట మాల్స్‌, షాపుల్లో కిలో టమాట రూ.120దాకా విక్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు టమాట పంట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పది రోజుల కిందట పరిస్థితులు చూస్తే .. హైదరాబాద్‌కు 850 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. ధరలు తగ్గుతుండటంతో తిరిగి వేల క్వింటాళ్ల టమాట హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది.

Tomato rates had dropped to roughly Rs 65 per kg across the state, chances to hike once again

రూ 65కి తగ్గిన ధర:టమోటా ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కేంద్రం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ ధరలకు టమోటా అమ్మకాలకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కౌంటర్లు సామాన్యులను ఏ మాత్రం సరిపోలేదు. దీంతో, బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ 200 వరకు టమోటా ధర చేరుకుంది. వర్షాలు తగ్గటం, మార్కెట్ కు పెద్ద మొత్తంలో టమోటా రావటంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది.

మరోసారి పెరుగుతాయా:ప్రస్తుతం ధర రూ.100లోపుకు దిగి వచ్చింది. ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో ధర 50కు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. విజయవాడలో రైతుబజార్లలో కిలోటమాటా రూ. 80 కు తక్కువగానే లభించింది. ఈ రోజుకు మరింతగా తగ్గింది. రూ 65 వరకు ఓపెన్ మార్కెట్ లో విక్రయాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ నెలాఖరుకు మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్న మాటలు సామాన్యుల్లో మరో సారి టెన్షన్ పెంచుతున్నాయి. కానీ, ప్రభుత్వ అధికారులు మాత్రం ధరలు మరోసారి పెరిగే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+