కాసులు గలగలలాడించిన ప్రజ్ ఇండస్ట్రీస్ షేరు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఐరోపా, అమెరికాతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో సూచీలన్నీ దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 392 పాయింట్ల లాభంలో ఉంది. 62 వేల 226 మార్క్ వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్స్ సూచీ నిఫ్టీ 113 పాయింట్లు వృద్ధి చెందింది. ఇది 18 వేల 434 మార్క్ వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా భారతీ ఎయిర్ టెల్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లు అద్భుతంగా పుంజుకోవడంతో ప్రజ్ ఇండస్ట్రీస్ స్టాక్ Praj Industries (NSE Code - PRAJIND) టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రజ్ షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబడ్డారు. దీంతో ఆ కంపెనీ షేరు 8 శాతానికిపైగా పెరిగింది. నిఫ్టీ 500 స్టాక్స్‌లో ఉంటుంది. 2023 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో లాభాలను ప్రకటించడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. 21 శాతం రెవెన్యూ పెరగడంతో రూ.1,003.98 కోట్లకు చేరింది. నెట్ ప్రాఫిట్ 52.83 శాతం పెరిగి రూ.88.11 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు రూ.4.5 డివిడెండ్ ప్రకటించింది.

ప్రజ్ ఇండస్ట్రీస్ మిడ్ క్యాప్ ప్రాసెస్ సొల్యూషన్స్ కంపెనీ. బ్రేవరీ, వాటర్ ట్రీట్మెంట్, బయో ఎనర్జీ, ఇథనాల్ సెక్టార్లలో సేవలందిస్తోంది. ముఖ్యంగా బయోఇథనాల్ ప్లాంట్ డిజైన్, నిర్మాణంలో ఇది ప్రసిద్ధి చెందింది. ఆటోమేషన్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, ఫీడ్ స్టాక్ అసెస్మెంట్, ప్లాంట్ డిజైన్ రంగంలో ఉంది. ప్రపంచవ్యాప్తాంగా ఈ కంపెనీకి మంచి మార్కెట్ ఉండి దాదాపు 75 దేశాల్లో సేవలందిస్తోంది. ఈ కంపెనీ స్టాక్‌ను తమ వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవాలని ఈక్విటీ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications