కడప, తిరుపతి, చెన్నై, విశాఖపట్నంవారికి ముఖ్య గమనిక
తిరుమలగిరులపై కొలువైన స్వామివారి దర్శనానికి రైళ్లలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ముఖ్య గమనిక. తిరుపతి రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్, మౌలికవసతుల అభివృద్ధి పనులు జరుగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పలు రైళ్లను రద్దుచేసింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు.
హైదరాబాద్, కడప, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్, చామరాజనగర్, రామేశ్వరం, కదిరిదేవరపల్లి, గుంతకల్, హుబ్బళ్లి, విల్లుపురం, పూర్ణ, భువనేశ్వర్, హౌరా నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే పలు రైళ్లను నిర్దేశిత తేదీల్లో రేణిగుంట-తిరుపతి, పాకాల-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. కాచిగూడ-మధురై, తిరువనంతపురం-హజ్రత్‌నిజాముద్దీన్, ఎర్నాకుళం-హజ్రత్ నిజాముద్దీన్, హాతియా-బెంగళూరు వెళ్లే పలు రైళ్లను మెల్పక్కం వద్ద నుంచి దారి మళ్లిస్తున్నారు.

జులై 12 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రద్దైన రైళ్ల వివరాలు
16203 చెన్నై సెంట్రల్ - తిరుపతి
16204 తిరుపతి-చెన్నై సెంట్రల్
06727 చెన్నై సెంట్రల్ సబర్బన్-తిరుపతి
06728 తిరుపతి-చెన్నై సెంట్రల్ సబర్బన్
06753 అరక్కోణం-తిరుపతి
06754 తిరుపతి-అరక్కోణం
రేణిగుంట-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు
07643, 07644 హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ (రేణిగుంట-తిరుపతి మధ్య)
జులై 12 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 17487, 17488 విశాఖపట్నం-కడప-విశాఖపట్నం (రేణిగుంట-తిరుపతి మధ్య)
16111 తిరుపతి-పుదుచ్చేరి-తిరుపతి (తిరుపతి-రేణిగుంట మధ్య)
16057, 16054, 16053, 16058 చెన్నై సెంట్రల్ -తిరుపతి- చెన్నై సెంట్రల్ (రేణిగుంట-తిరుపతి మధ్య)
16219 చామరాజనగర్-తిరుపతి-చామరాజనగర్ (తిరుపతి-పాకాల మధ్య)
పూర్తిగా రద్దైన, పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు రైల్వే తన వెబ్ సైట్ లో పొందుపరిచింది.












Click it and Unblock the Notifications