విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూతన వాహనాల్లో టిఆర్ నంబర్లతో తెగతిరిగేస్తున్నారా?...ఇది తెలుసుకోండి!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:కొత్త వాహనం కొన్నప్పుడు కేటాయించే టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ తో గడువు గురించి పట్టించుకోకుండా తెగతిరిగేస్తున్నారా...అలా అయితే అలాంటి వాళ్లందరూ ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!...

అదేమిటంటే...ఇకమీదట మీ వాహనానికి టిఆర్ నంబర్ గడువు తీరేలోపు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే రవాణాశాఖే మీ వెహికల్ కి ఆటోమేటిక్ గా ఏదో ఒక సీరియల్ నంబర్ ప్రకారం దానికి ఇష్టం వచ్చిన పర్మినెంట్ నంబర్ మీకు కేటాయించేస్తుంది. ఆ రకంగా నూతన వాహనాలకు పర్మినెంట్ నంబర్ కేటాయించేలా రవాణాశాఖ నూతన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.

ఈ విధానాన్ని అతి త్వరలోనే అంటే మే నెలలోనే అమల్లోకి తెచ్చేందుకు రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం కొత్త వాహనం కొన్న తరువాత 30 రోజుల పాటు వినియోగించుకునేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టిఆర్ నంబర్) ఇస్తున్నారు. అయితే చాలామంది తమకు కావాల్సిన నంబర్‌ సీరియల్ ఇంకా రాలేదని, టిఆర్ నంబర్ గడువు ముగిసినా పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లటం లేదు. టీఆర్‌ నెంబర్‌తోనే నెలల తరబడి వాహనాన్ని నడుపుతున్నారు.

Travelling with TR numbers? ...Rules are changing ...Find out

అయితే ఇక ఈ పద్ధతిని పూర్తిగా మార్చేయాలనే ఉద్దేశంతో రవాణా శాఖ కొత్త సాఫ్ట్‌వేర్‌ తెచ్చినట్లు తెలుస్తోంది. నూతన విధానంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయిపోగానే అప్పటి వరకు వాహనాలకు కేటాయించబడిన సిరీస్‌ ను ఆధారం చేసుకొని ఆటోమేటిక్‌గా కొత్త నెంబరును ఆ టిఆర్ ముగిసిన వాహనానికి కేటాయించేస్తుంది. దీనివల్ల ఇబ్బందేముంది అంటారా?...ఏ నంబర్ అయితేంలే అనుకునేవారికి ఈ విధానం వల్ల ఎలాంటి నష్టం లేదు...కానీ తమ వాహనానికి తమకు ఇష్టమైన నంబరే ఉండాలని బలంగా కోరుకునేవారికి మాత్రం ఈ విధానం వల్ల ఇబ్బందే. ఎందుకంటే...

ఒకసారి ఇలా టిఆర్ నంబర్ ముగిసాక అలాట్ అయిన ఆటోమేటిక్ పర్మినెంట్ నంబర్ ఆ తరువాత ఆ నంబర్ మీకు ఇషం ఉన్నా...లేకున్నా...దీన్ని మార్చుకోవడం అసాధ్యమని రవాణాశాఖ వర్గాలే స్ఫష్టం చేస్తున్నాయి. ఈ విధానం మొదటగా విశాఖ జిల్లా నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో 9435 వాహనాలు టీఆర్‌ నెంబరుతో తిరుగుతున్నట్టు గుర్తించిన రవాణాశాఖ అధికారులు గత నెల రోజుగా వీటిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా చాలామందిలో మార్పు రాకపోవడంతో ఈ తాజా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

English summary
AP Transport Department officials will be implementing another new system in the State. In this system is automatically allocating a new permanent number for TR number expired vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X