ఎంపీ రఘురామకు హైకోర్టులో ఎదురు దెబ్బ - సీఎం జగన్ పై కేసులో..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ దాఖుల చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సీఎం జగన్ షరతులు ఉల్లంఘించిన సంఘటన ఒక్కటీ లేదని హైకోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ పైన గతంలో ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తనపై విచారణ జరుగుతున్న కేసులను,సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ కృష్ణరాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ బయట ఉంటే కేసుల విచారణ సజావుగా సాగడం కష్టమని... కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరారు.

పిటిషన్ వేసినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని... సీఐడీతో తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. పిటిషనర్ తన రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కోర్టును వాడుకుంటున్నారని ఆరోపించారు.జగన్ సీఎంగా ఉన్నారనే కారణం తప్ప... సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్క కారణం కూడా చూపలేకపోతున్నారని పేర్కొన్నారు.

సాక్షుల ప్రభావితమని రఘురామ చేస్తున్న వాదన ఊహాజనితమని.. కాబట్టి విచక్షణ మేరకు,చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. దీని పైన విచారించిన సీబీఐ కోర్టు రఘురామ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో, సీబీఐ కోర్టు తీర్పు పై రఘరామ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ కు వెళ్లారు.

TS High Court dismissed MP Raghu Rama plea on CM jagan bail cancellation

ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. జగన్ పై ఉన్న 11 ఛార్జి షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. సీబీఐ కోర్టు తన పిటీషన్ ను కొట్టి వేయటంతో హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసారు.

దీని పైన విచారించిన హైకోర్టు పిటీషన్ లో పేర్కొన్నవి సరైన కారణాలు కాదని అభిప్రాయపడింది. గతంలో సీబీఐ కోర్టు ఇదే పిటీషన్ ను కొట్టివేసిన పరిస్థితికీ, ఇప్పటికీ మార్పు లేదని పేర్కొంది. ఈ పిటీషన్ లో జోక్యానికి కారణాలు లేవని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రఘురామ పిటీషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో, ఇప్పుడు రఘురామ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+