TTD: తిరుమల హోటల్స్ కు ఈవో టెన్షన్!!

టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల ప్రక్షాళనకు నడుము బిగించిన విషయం తెలిసిందే. తిరుమలను ప్రక్షాళన చేసేందుకు సమర్ధ అధికారులను నియమించిన చంద్రబాబు తిరుమలలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా టీటీడీని గాడిలో పెట్టాలని సూచించారు.

అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న టీటీడీ ఈవో
ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి తిరుమలకు వెళ్ళిన సమయంలో కూడా చంద్రబాబు తిరుమల నుండే ప్రక్షాళన షురూ చేస్తున్నట్టు చెప్పారు . అందులో భాగంగా టిటిడి ఈవోగా సమర్ధ అధికారి జే. శ్యామలారావును నియమించారు. ఇక ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తిరుమలలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.

TTD EO sudden inspections in tirumala hotels and restaurants gave solid warning

తిరుమలలో గాడి తప్పిన పాలనను మళ్లీ ట్రాక్ ఎక్కించే
నిత్యం తనిఖీలతో హడావిడి చేస్తున్నారు. మారు వేషంలో వెళ్లి షాపులలో అధిక ధరల పైన నిఘా పెడుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను దళారీల మోసం నుంచి కాపాడడం పైన శ్రద్ధ పెడుతున్నారు. తిరుమలలో గాడి తప్పిన పాలనను మళ్లీ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి ఈవో జే శ్యామల రావు. ఇందులో భాగంగా నేడు నిర్దేశించిన ధరల కన్నా అధిక రేట్లకు శ్రీవారి భక్తులకు వస్తువులను విక్రయిస్తే అలాంటి షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె.శ్యామలారావు తిరుమలలో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కౌస్తుభం రెస్టారెంట్ లో తనిఖీలు చేసి నిబంధనలు ఏమాత్రం పాటించకపోవడంతో హోటల్ కిచెన్ మూసివేయించారు. అలాగే నిషేధిత ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ...రేషన్ బియ్యం, పాడైన కూరగాయలు, ముడిసరుకులు ఉండడాన్ని గమనించారు. హోటల్ యాజమాన్యంపై ఈవో సీరియస్ అయ్యారు.

ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ల్యాబ్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చాం
ఈ సందర్భంగా టీటీడీ ఈఓ పాత్రికేయులతో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ల్యాబ్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రైవేటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్ లో ఆహార విక్రయాలపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+