TTD: తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు, అనూహ్య మార్పుతో..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ ట్రస్టులకు విరాళాలు పెరిగాయి. గత పదకొండ నెలల కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చాయి. విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు సమర్పిస్తున్నారు. టీటీడీకి వచ్చిన విరాళాల లెక్కలను టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో టీటీడీ ట్రస్టులకు వచ్చే విరాళాలు పెరిగాయి. వివిధ ట్రస్టులకు గత 11 నెలల్లో మొత్తం రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విరాళాల ద్వారా తిరుమల భక్తుల భక్తిశ్రద్ధ, దేవాలయంపై ఉన్న విశ్వాసం ఎంత గాఢంగా ఉందో మరోసారి రుజువైంది. వీటిలో ఆన్‌లైన్ ద్వారా రూ.579.38 కోట్లు, ఆఫ్‌లైన్ ద్వారా రూ.339.2 కోట్లు సమకూరాయి. ఈ మొత్తం దానాల ద్వారా దేవస్థానం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం అవుతాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు అత్యధికంగా రూ.338.8 కోట్లు విరాళాల రూపంలో చేరాయి.

అదే విధంగా శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు రావడం గమనార్హం. ఈ ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు పొందే విధానం సులభతరం చేయడమే కాకుండా, వచ్చిన విరాళాలను వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అలాగే ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్ల విరాళాలు అందాయి.
తిరుమలలో శ్రీవారి సేవా కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయి. భక్తులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ విరాళాల ద్వారా TTD విద్య, వైద్యం, గోసంరక్షణ, అన్నప్రసాదం వంటి పుణ్య కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications