పవన్ వార్నింగ్ లెక్క చేయని టీటీడీ-ఏం చేస్తోందో తెలుసా ?

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటీ పడి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో వీఐపీ సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో సామాన్య భక్తులు టోకెన్ల కోసం పోటీ పడి చనిపోయిన ఘటన తర్వాత అయినా టీటీడీ తీరు మార్చుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారు.వీఐపీ యాటిట్యూడ్‌ మానేయాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ అవేవీ వారు పట్టించుకోవడం లేదని తేలిపోయింది.

టీటీడీలో ప్రక్షాళన జరగాలని, వీఐపీలను కాదు సామాన్య భక్తుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సూచించి 24 గంటలు కూడా గడవకముందే పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భారీగా వీఐపీల్ని టీటీడీ అనుమతించింది. దీంతో పతంజలి రాందేవ్ బాబాతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలు ఇవాళ యథేచ్ఛగా దర్శనాలు చేసుకున్నారు.

ttd ignores deputy cm pawan kalyan s warning on vip darshans continue to allow them

ఇవాళ తెల్లవారు జామునుంచి తిరుమలలో వీఐపీ దర్శనాలు చేసుకున్న వారిలో రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ,తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, గడ్డం వినోద్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ మాజీ మంత్రులు మల్లా రెడ్డి, తెలంగాణ కడియం శ్రీహరి, సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు.

అలాగే ఏపీకి చెందిన టీడీపీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, సమాచార మంత్రి పార్ధసారధి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, బీసీ మంత్రి సవిత, గిరిజన మంత్రి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఏపీ రాజ్య సభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సినీ ఇండస్త్రీకి చెందిన బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరి నాథ్, బ్యాట్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవాళ దర్శనాలు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+