TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక - టీటీడీ లో కీలక మార్పు..!!

Tirumala: ఇక తిరుమలలో కల్తీకి అవకాశం లేకుండా కీలక నిర్ణయం జరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం కలకలం రేపింది. కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల ప్రసాదం పరీక్ష కోసం ఆధునిక ల్యాబ్ తిరుమలలో అందుబాటులోకి వచ్చింది. జర్మనీ నుంచి 70 లక్షల విలువైన 2 యంత్రాలు తిరుమల ల్యాబ్‌కు విరాళంగా ఎన్డీడీబీ ఇచ్చింది. వచ్చేనెల నుంచి ఈ ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సన్నాహాలు చేస్తోంది.

తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ ఉన్నా గుర్తించేలా నూతన పరికరాలతో టీటీడీ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కల్తీపై ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో, ఇక ఎలాంటి అపోహలకు అవకాశం లేకుండా పూర్తి నాణ్యతతో ప్రసాదం తయారీకి వీలుగా తాజా విధానం అమల్లోకి వచ్చింది. తిరుమలలోని ల్యాబ్‌కు నెయ్యిని వందశాతం పరీక్షించే సామర్థ్యం లేదని, అక్కడ ఉన్న యంత్రాలతో మాయిశ్చరైజ్‌, కెమికట్‌ అనాలసిస్‌, ఆర్‌ఐ(రిఫ్రాక్ట్‌ ఇండెక్స్‌) వంటి ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేయగలమని పలువురు నిపుణులు నివేదిక ఇచ్చారు. దీంతో ఇక్కడి ల్యాబ్‌లో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు టీటీడీ నిర్ణయించింది.

TTD is getting ghee adulteration testing equipment from NDDB details here

ఈ మేరకు నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు కావాల్సిన యంత్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ఫ్యాటీ ఆసిడ్‌ మైథెల్‌ ఎస్టర్‌, బీటా-సిటోస్టెరాల్‌ వంటి పరీక్షలకు గ్యాస్‌ క్రోమాటోగ్రాఫ్‌ (జీసీ), హై ఫెర్ఫార్మన్స్‌ లిక్విడ్‌ క్రోమాటోగ్రాఫ్‌ (హెచ్‌పీఎల్‌సీ) అనే రెండు యంత్ర పరికరాలు అవసరమని నేషనల్‌ ల్యాబ్‌ నిపుణులు టీటీడీకి సూచించారు. దాదాపు రూ.70 లక్షల విలువైన ఈ రెండు పరికరాలను విరాళంగా ఇచ్చేందుకు నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డ్‌ ముందుకు వచ్చింది. వీటిని ఇటీవల జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబ్‌లో అమర్చారు. వీటిద్వారా నెయ్యి నమూనాలను పరీక్షించేందుకు ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

దీంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాడర్డ్స్‌ రెగ్యులేషన్‌ (ఎఫ్ఎస్ఎస్ఆర్‌) నిబంధనల ప్రకారం నెయ్యిని పూర్తిస్థాయిలో పరీక్షించే స్థాయికి టీటీడీ ల్యాబ్‌ వచ్చింది. వచ్చేనెల నుంచి ఈ ల్యాబ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఇక పూర్తి స్థాయి పరీక్షలు తిరుమలలోనే నిర్వహించనున్నారు. భవిష్యత్ లో ఎలాంటి అనుమానాలు .. కల్తీకి అవకాశం లేకుండా కొత్త విధానం అందుబాటులోకి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+