వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయాలు- స్థానికులకు గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. దీనికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఇందులో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలపై చర్చించడానికి టీటీడీ ట్రస్టు బోర్డు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకుంది.
డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించింది. 10 రోజుల్లో మొత్తం 182 గంటల పాటు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాల్సి ఉండగా.. ఇందులో 90 శాతం అంటే.. 164 గంటల పాటు సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో- సామాన్య భక్తులకు పెద్ద పీట వేసినట్టవుతుందని బీఆర్ నాయుడు తెలిపారు.

- వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి మూడు రోజులు 300 రూపాయలు, శ్రీవాణి కోటా టికెట్ల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
- జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది.
- ఇందులో కూడా మొదటి మూడు రోజులకు ఈ- డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుంది.
- ఈ నెల 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది.
- డిసెంబర్ 2వ తేదీన డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లను కేటాయిస్తారు.
- టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీ, రిజిస్ట్రేషన్లకు అవకాశం.
- జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు చేస్తుంది టీటీడీ
- ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు అందుతాయి.
- 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దయ్యాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications