దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!!

TTD: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవి వేళ భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీలో మార్పులు చేయనున్నారు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని అనుసరించా లని టీటీడీ భావిస్తోంది. అమలు ముహూర్తం ఖరారు చేసింది.

వేసవిలో రద్దీ వేళ కొత్త నిర్ణయాల అమలుకు టీటీడీ సమాయత్తం అవుతోంది. మే 1 నుంచి వేసవి రద్దీ కారణంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్‌ఎస్‌డీ (Slotted Sarva Darshan) టోకెన్ల జారీలో మార్పులు చేయనుంది.. వేసవిలో ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తూ, సాధారణ భక్తులకు సర్వదర్శనం సమయాన్ని పెంచేలా టీటీడీ యోచిస్తోంది. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్లలో మార్పులు ఉంటాయి. టీటీడీ బోర్డు గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించింది. మే, జూన్, జులై నెలల్లో ప్రతినెలా సుమారు 23 నుంచి 24 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు గుర్తించారు. వీఐపీ దర్శనాల కోసం రోజు 2 నుంచి 3 గంటల సమయాన్ని కేటాయించబడుతోంది. ఈ రెండు మూడు గంటల్లో సుమారు 3800 మంది మాత్రమే దర్శనం పొందుతున్నారు. అదే సమయాన్ని సామాన్య భక్తుల కోసం కేటాయిస్తే సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ttd-planning-for-big-changes-in-darshan-tokens-system-during-sumer-rush-here-the-details

తిరుమలలో రద్దీ వేళ కొత్త నిర్ణయాలు

కాగా.. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు 22 నుంచి 23 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిని మార్చేందుకు గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలు చేసిన విధానాన్ని అనుసరించాలని టీటీడీ భావిస్తోంది. ఈ విధానంలో అన్ని కేటగిరీలు తాత్కాలికంగా పక్కనపెట్టి ఒకేవిధమైన దర్శనాన్ని నిర్వహించడం ద్వారా నిరీక్షణ సమయాన్ని 8 నుంచి 12 గంటల మధ్యకు తగ్గించే అవకాశం ఉంటుందని అంచనా. గతంలో ఈ విధానం అమలు ద్వారా సామాన్య భక్తులకు ప్రయోజనం కలిగింది. త్వరగా దర్శనం చేసుకునే వెసులుబాటు దక్కింది. దీంతో, వేసవి రద్దీ వేళ తిరిగి ఇదే విధానం అమలు దిశగా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ విధానం అమలు పైన టీటీడీ అధికారికంగా ప్రకటన చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+