TTD: తిరుమలలో భక్తులకు ఇక సులభంగా వసతి - టీటీడీ కీలక నిర్ణయం..!!

Tirumala: తిరుమలలో భక్తులకు వసతి విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తులకు దర్శనం మరింత త్వరగా జరిగేలా కొత్త మార్పులు చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది .. వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తర ద్వార దర్శనం వేళ భారీగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సులభంగా వసతి
తిరుమలకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యం సులభతరం చేసేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుం ది. ఇందు కోసం చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని గరుడాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని ప్రారంభించారు. సామా న్య భక్తులకు తిరుమల లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తిరుమలలోని 42 ఉప విచారణ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు.

TTD providing sub enquiry offices for pilgrims to get accommodation in tirumala hassle free

కరెంట్ బుకింగ్
గదుల కరెంట్ బుకింగ్ లో కేంద్రీయ విచారణ కార్యాలయంపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను వికేంద్రికరించినట్లు చెప్పారు. ఉప విచారణ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభతరమవుతుందని వివరించారు. కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్‌ ఎన్‌క్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని ఈవో తెలిపారు. కరెంట్ బుకింగ్ కింద గదులు పొందే భక్తులు ఇబ్బందులు లేకుండా వారు పొందిన కాటేజీకి సంభందించిన సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో చెప్పుకొచ్చారు.

ఏఐ వినయోగంతో
సాంకేతిక పరిజ్ఞానం వినియో గిస్తూ..ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరి చేసుకుంటూ భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. అదే విధం గా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఛాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. భక్తుల సంఖ్యను కచ్చితంగా లెక్కించేందుకు ఫేస్ రెకగ్నిషన్ టెక్నాలజీని అందించేందుకు రిలయన్స్‌ ముందుకొచ్చిందని ఈవో వెల్లడించారు. ఇందులో గూగుల్‌కూ భాగస్వామ్యం కల్పిస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+