తిరుమలకు వచ్చే భక్తులకు విజ్ఞప్తి టీటీడీ- తాజా నిర్ణయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్ ఏడో మైలు వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో చోటు చేసుకున్న చోరీ అనంతరం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటనలో టీటీడీ విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం శరవేగంగా కదిలింది. చోరీ ఘటన చోటు చేసుకున్న 14 గంటల్లోనే నిందితుడిని గుర్తించింది. అతన్ని అదుపులోకి తీసుకుంది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దాన్ని పునః ప్రతిష్ట సైతం నిర్వహించింది టీటీడీ.

చోరీకి గురైన ప్రదేశంలోనే ఆంజనేయస్వామి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు టీటీడీ అధికారులు. ఆగమ సంప్రదాయాల ప్రకారం పుణ్యాహవచనం, జల సంప్రోక్షణం తదితర శాస్త్రోక్త క్రతువులు నిర్వహించారు. ఈ పునః ప్రతిష్ఠ, అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజాదిక కార్యక్రమాల్లో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD Taken key decision CCTV Cameras After Stolen Hanuman Idol Reinstalled at Tirumala Temple

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ చోరీ ఘటనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల నిఘా, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత, జిల్లా పోలీసులతో సమన్వయం కారణంగా అతి తక్కువ సమయంలో నిందితుడిని గుర్తించామని, 14 గంటల వ్యవధిలోనే విగ్రహాన్ని తిరిగి తీసుకురావడం సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని అన్నారు.

ఘాట్ రోడ్డులోని చిన్న దేవాలయాలు, విగ్రహాలకు రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరింత నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్లలో దశాబ్దాలుగా భక్తులు ప్రతిష్ఠించిన అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయని, వాటి పవిత్రతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే భక్తులు టీటీడీ టోల్‌ఫ్రీ నంబర్ లేదా విజిలెన్స్ అధికారులకు తెలియజేయాలని కోరారు.

టీటీడీ వద్ద అత్యాధునిక నిఘా వ్యవస్థ అందుబాటులో ఉందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వాటిని వెంటనే గుర్తిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి అత్యాధునిక సాంకేతికతను తాము అడాప్ట్ చేసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+