అర్థం చేసుకోండి.. కూల్!: చంద్రబాబుకు టిటిడిపి విజ్ఞప్తి

రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ అధ్యక్షునిగా మీరు అన్ని ప్రాంతాల సమస్యల గురించి మాట్లాడాలని, అక్కడ కూడా పార్టీని కాపాడుకోవాలని కానీ, అదే సమయంలో మీరు ఆవేశానికి గురి కావాల్సిన అవసరం లేదని వారు బాబుకు సూచించారట. అలాగే విభజన ప్రక్రియను నిలిపివేయాలన్న మాట కూడా అనవద్దని కోరినట్లుగా తెలుస్తోంది.
సమస్యలు చెప్పి వాటిని పరిష్కరించాలని కోరాలని కానీ, విభజన ఆపాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారట. అయితే, సమస్యలను పరిష్కరించకుండా ముందుకెళ్లడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయన్నదే తన ఉద్దేశ్యమని బాబు వారికి వివరించారట. ప్రత్యేక విమానంలో బిల్లును తీసుకురావడాన్ని చంద్రబాబు తప్పుబట్టడంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.












Click it and Unblock the Notifications